జగన్ దెబ్బ రుచి తెలుసుకున్న జేసీ..

 జేసీ దివాకర్ రెడ్డి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేని నేత.. ఎప్పటికప్పుడు మీడియాకి కావాల్సిన మేత వేయటంలో ముందుండే నేత. తాజాగా జేసీ మరోసారి మీడియాతో మాట్లాడిన మాటలు వింటే ఆయనకి సీఎం జగన్ మోహన్ రెడ్డి దెబ్బ ఏమిటో అర్ధం అయ్యినట్లు వుంది. ‘కుటుంబంతో దూరంగా ఉంటున్నా. లైవ్ లీ హుడ్ జరగడమే కష్టంగా ఉంది. భార్య, చెల్లి పేరుతో గనులు ఉన్నాయి. వైసీపీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డితో పాటు ఇతర నేతల గనులున్నా.. నా భార్య పేరుతో ఉన్న గనులను మాత్రమే శోధించారు. వ్యక్తిగతంగా నా కుటుంబంపై కక్ష సాధించేందుకే ఇదంతా చేశారు. ఇప్పటికే నా కుటుంబాన్ని అన్ని రకాలుగా బాధించారు. నా త‌మ్ముడిని లోపల వేశారు. కేసులన్నీ కక్ష సాధింపులో భాగమే’ అంటూ జేసీ చెప్పిన విధానం చూస్తుంటే ఎక్కడ తగలలో అక్కడే గట్టి దెబ్బ జేసీ తగిలినట్లు అనిపిస్తుంది.

Jc Telugu Rajyam

 

  గతంలో జగన్ గురించి ఎన్నో సార్లు వ్యంగంగా మాట్లాడిన వ్యక్తి జేసీ. ‘వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అంటే మావాడే. మా స్నేహితుడి కొడుకు’ అంటూ జేసీ మాట్లాడిన మాటల్లో అభిమానం కంటే కూడా అవహేళన కనిపిస్తుంది. మా వాడే మా వాడే అంటూ జగన్ ను ఒక కులానికి అంటగట్టే ప్రయత్నాలు గట్టిగానే చేశాడు . వాటి ఫలితమే ఇప్పుడు అనుభవిస్తున్నాడు జేసీ. అయితే తనని ఎందుకు జైలుకి పంపించలేదో కూడా జేసీనే చెప్పటం విశేషం. నేను జగన్ మా వాడే మా వాడే అంటున్న కాదు అందుకే నన్ను టచ్ చేయకుండా నా జీవనాధారం మీద దెబ్బ కొడుతున్నాడు జగన్ అంటూ చెప్పుకొచ్చాడు. ఇదే సమయంలో ఘాటైన హెచ్చరికలు కూడా జేసీ చేయటం జరిగింది.

  నా గనులకు పర్మిట్లు ఇవ్వకుండా తిప్పించుకుంటున్నారు. మరోసారి ఆఫీస్ కి వస్తాను, అప్పుడు కూడా ఇవ్వకపొతే ఇక్కడే కూర్చొని నిరాహార దీక్ష చేస్తాను, అప్పుడు ఎలాగూ పైకి పోతాను వాళ్ళ కోరిక కూడా తీరుతుంది. లేకపోతే పోలీసులే నాకు సన్మానం చేయటానికి రెడీ గా ఉన్నారుఎన్నో సత్కారాలు అనుభవించిన పెద్దవాణ్ని. అందరికీ చెబుతున్నా.. మీరు నాకు సత్కారం చేస్తారు. అందుకు రెట్టింపు సత్కారం కూడా మీకు ఏదో ఒక రోజు వస్తుంది. నాకు సత్కారం చేసే పెద్దవాళ్లకు సత్కారం చేసి మా రుణం తీర్చుకుంటాం.. ఇంతకంటే ఘనమైన సత్కారం తీర్చుకోకతప్పదు’ అని జేసీ ఘాటైన హెచ్చ‌రిక చేశారు.

  ఆయన సోదరుడు అతని కొడుకు ఇద్దరు దొంగ బస్సు ల విషయంలో అరెస్ట్ అయ్యి వెళ్లిన విషయం తెలిసిందే, అక్కడ నుండి బయటకు వచ్చిన వెంటనే మళ్ళీ మరో కేసు ఫైల్ చేసి అరెస్ట్ చేయటం జరిగింది. ఇంకో పక్క సున్నపురాయి గనులకు పర్మిట్లు ఇవ్వకుండా జేసీ బ్రదర్స్ యొక్క ఆర్థిక మూలాలు కదిలేలా చేస్తున్నారు. అందుకే జేసీ నోటినుండి ఇలాంటి దీనమైన మాటలు వచ్చాయి. గతంలో అధికారంలో ఉన్నప్పుడు చూపించిన దర్పం, అహంకారం ఇప్పుడు కనిపించకపోగా, దీనావస్థ కనిపిస్తుంది. ఏమి చేద్దాం ఎవరెంత చేసుకుంటే అంత ఫలితమని ఊరికే చెప్పలేదు పెద్దలు

 

Related Articles

Gallery

- Advertisement -

Recent Articles