తెలంగాణపై స్పెషల్ పోకస్ పెట్టిన జనసేనాని: కండిషన్స్ అప్లయ్.!

జనసేన అధినేత పవన్ కళ్యాణ్, తెలంగాణలో తాము పోటీ చేయబోయే నియోజకవర్గాల సంఖ్య విషయమై ఇటీవల కీలక వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.? ‘ఎన్ని సీట్లలో పోటీ చేద్దాం.? అంటూ జనసేన క్రియాశీలక కార్యకర్తలను అడిగారు. అదీ ఆంధ్రప్రదేశ్ల‌ోని మంగళగిరిలో నిర్వహించిన పార్టీ కీలక సమావేశంలో.

అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం దాదాపు 15 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసేలా జనసేనాని తెలంగాణకు సంబంధించి వ్యూహ రచన చేస్తున్నారట. ఇందులో మెజార్టీ నియోజకవర్గాలు గ్రేటర్ హైద్రాబాద్ పరిధిలో వుండేందుకు అవకాశముంది.

కాగా, రెండు లేదా మూడు లోక్ సభ నియోజకవర్గాల్లోనూ పోటీ చేయాలన్న దిశగా జనసేన పార్టీ పావులు కదుపుతోంది. అసలు తెలంగాణలో జనసేన పార్టీకి సరైన నాయకులెవరున్నారు.? అంటే, జనసేన పేరుతో అడపా దడపా పలు నిరసన కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయడం తప్ప.. నిఖార్సుగా పార్టీ కార్యకలాపాలు చేపట్టే నాయకులెవరూ లేరన్నది నిర్వివాదాంశం.

మరి, తెలంగాణలో పోటీ విషయమై జనసేనాని ఎందుకు ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు? వచ్చే ఎన్నికల నాటికి జాతీయ పార్టీ బీఆర్ఎస్ విషయమై తాము అనుకున్నది సాధిస్తామన్న ఆలోచన తెలంగాణ రాష్ట్ర సమితిలో వుంది. ఒకవేళ తెలంగాణ రాష్ట్ర సమితి కాస్తా భారత రాష్ట్ర సమితిగా మారితే.. జనసేనకే కాదు, తెలుగుదేశం పార్టీకీ కూడా తెలంగాణలో కొంత సానుకూల పరిస్థితులు వుంటాయి.

దాంతోపాటుగా, తెలంగాణ రాష్ట్ర సమితితో కొంత సానుకూలంగా వుంటున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. ఈ నేపథ్యంలో ఓ రెండు లోక్ సభ నియోజకవర్గాల్ని జనసేన పార్టీ, టీఆర్ఎస్ నుంచి పోటీ చేయడానికే అయినా పొందలేదా.? సో, ఒక వైపు టీడీపీ.. ఇంకో వైపు టీఆర్ఎస్.. ఇలా జనసేనకు రెండు ఛాన్సులున్నాయి.. రెండు లోక్ సభ టిక్కెట్ల విషయమై.