బీజేపీతో కలిసి జీహెచ్ఎంసీ బరిలో పవన్ కళ్యాణ్ !!

జనసేన పార్టీ పెట్టిన తరువాత పవన్ కళ్యాణ్ పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయలపైనే దృష్టి పెట్టారు. అయితే వీలును బట్టి తెలంగాణలోనూ పోటీ చేస్తామని అప్పట్లో ప్రకటించింది. గత ఎన్నికల్లో నేరుగా పోటీ చేయకుండా మాయావతి నేతృత్వంలోని బహుజన సమాజ్ పార్టీకి మద్దతిచ్చింది. తాజాగా తెలంగాణలో ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయం తీసుకుంది. అయితే ఇప్పుడు నేరుగా పోటీ చెయ్యడానికి సిద్ధమైనట్టు తెలుస్తుంది. హైదరాబాద్ గ్రేటర్ ఎన్నికల్లో గెలిచి తమ సత్తా చాటుకోవలని బీజేపీ నాయకులు తహతహలాడుతున్నారు. కానీ వాళ్లక్కూడా తెలుసు అది సాధ్యం కాదు. కానీ విజయం కోసం పవన్ కళ్యాణ్ ను వాడుకోవడానికి బీజేపీ నాయకులు పతకాలు రచిస్తున్నారు. ఇప్పటికే ఏపీలో ఎలాగో కలిసే ఉన్నారు. కాబట్టి తెలంగాణలోనూ కలిసి పోటీ చెయ్యడానికి జనసేన, బీజేపీ నాయకులు చర్చలు జరుపుతున్నారు.

pawan kalyan
pawan kalyan

త్వరలోనే ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. బీజేపీకి గ్రామీణ ప్రాంతాల కంటే పట్టణ ప్రాంతాల్లో కాస్త పట్టుంది. అదే సమయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు యువతలో మంచి క్రేజ్ ఉంది. ఈ నేపథ్యంలో కలిసి పోటీ చేస్తే తప్పకుండా లాభం కలుగుతుందని ఆ పార్టీలు భావిస్తున్నాయి. ఈ విషయంలో పవన్ కల్యాణ్, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ మధ్య చర్చలు కూడా జరిగినట్టు సమాచారం. పది శాతం సీట్లను జనసేనకు ఇచ్చేలా ఒప్పందం కుదిరిందని తెలుస్తోంది.

మొత్తమ్మీద 15 సీట్ల వరకు జనసేనకు కేటాయించేందుకు బీజేపీ అంగీకరించినట్టు సమాచారం. ఒక్కసారి సీట్ల కేటాయింపుల విషయంలో స్పష్టత వస్తే బయటకు వచ్చి బీజేపీ జనసేన నేతలు మీడియాకు ప్రకటించనున్నారు. ఇప్పటికే గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్, కాంగ్రెస్ ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్న నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎంట్రీతో అక్కడ మరింత రాజకీయ హీట్ పెరగనుంది. పవన్ తన ఎంట్రీతో కేసీఆర్ కు ఎలాంటి షాక్ ఇస్తారో వేచి చూడాలి.