Vaishno Devi Temple: వైష్ణో దేవి ఆలయంలో దారుణం.. తొక్కిసలాట 12 మంది మృతి..!

Vaishno Devi Temple: జమ్మూ కాశ్మీర్ లోని నూతన సంవత్సరం కానుకగా ఎంతో మంది భక్తులు వైష్ణోదేవి ఆలయానికి వెళ్లారు. నూతన సంవత్సరం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి దర్శనం కోసం ఆలయానికి తరలి వెళ్లడంతో భక్తుల రద్దీ ఎక్కువైంది. దీంతో అమ్మవారి దర్శనం కోసం వెళ్లిన భక్తులలో పెద్ద ఎత్తున తొక్కిసలాట జరగడం వల్ల ఘోరం చోటు చేసుకుంది.ఈ తొక్కిసలాటలో భాగంగా ఏకంగా 12 మంది భక్తులు మృతి చెందారు. అలాగే మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు.

ఈ క్రమంలోనే గాయపడిన వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఘటనపై అధికారులు మాట్లాడుతూ నూతన సంవత్సరం కానుకగా శనివారం ఉదయం పెద్ద ఎత్తున భక్తులు త్రికూట కొండపై ఉన్న గుడికి భక్తులు చేరుకున్నారు. ఇక్కడ అమ్మవారి దర్శనం చేసుకుంటున్న క్రమంలో తొక్కిసలాట జరిగిందని ఈ తొక్కిసలాటలో భాగంగా 12 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ ఘటన ఆలయం గర్భగుడి వెలుపల జరిగినట్లు తెలిపారు. ఈ తొక్కిసలాట జరిగిన వెంటనే ఆలయ అధికారులు పోలీసు అధికారులు సహాయ చర్యలు చేపట్టినా ఫలితం లేకుండా పోయింది .ఈ తొక్కిసలాటలో భాగంగా సుమారు పదుల సంఖ్యలో భక్తులు గాయపడ్డారనీ వీరిని వెంటనే మాతా వైష్ణో దేవి నారాయణ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్‌తో సహా ఇతర ఆసుపత్రుల్లో చేర్చారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని అధికారులు వెల్లడించారు. మృతిచెందిన వారిలో ఎక్కువగా ఢిల్లీ, హర్యానా, పంజాబ్ జమ్మూ కాశ్మీర్ కు చెందిన భక్తులు అధికంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.