Crime News: జమ్మూకాశ్మీర్ లో అగ్నిప్రమాదం వల్ల భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు ఘటనలో ముగ్గురు వ్యక్తులు మరణించగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం సాయంత్రం జమ్మూకాశ్మీర్లోని రెసిడెన్సి రోడ్డు లో ఉన్న ఒక బిల్డింగ్ గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్న వ్యర్థాల షాప్ లో మంటలు అంటుకొని భారీ పేలుడు జరిగింది. వివరాలలోకి వెళితే… సోమవారం సాయంత్రం 6 గంటల 15 నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఒక వ్యర్థాల దుకాణంలో భారీగా మంటలు చెలరేగి బిల్డింగ్ మొత్తం మంటాలు వ్యాపించాయి ఈ మంటల కారణంగా ఎల్పిజి సిలిండర్లు వెళ్ళటం వల్ల ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు అంచనా వేస్తున్నారు.అగ్ని ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొని వచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న జమ్మూకాశ్మీర్ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ చందన కోహ్లీ మాట్లాడుతూ షార్ట్ సర్క్యూట్ కారణంగానే అగ్ని ప్రమాదం జరిగి ఉండవచ్చునని ఆయన వెల్లడించారు.
ఈ ప్రమాదంలో మొత్తం ఐదుగురు మరణించగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. పోస్టుమార్టం నిమిత్తం మరణించిన వారిని ఆస్పత్రికి తరలించగా, క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన గురించి జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ఘటనలో మరణించిన వారి కుటుంబాలకు రూ. 5 లక్షల చొప్పిన ఎక్స్గ్రేషియా ప్రకటించగా.. తీవ్ర గాయాలైన వారికి లక్ష రూపాయిలు, స్వల్ప గాయాలు అయిన వారికి రూ. 25 వేలు ఇవ్వనున్నట్లు తెలిపారు.