హీరో గోపీచంద్ కు ప్రమాదం!

టాలీవుడ్ హీరో గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు. షూటింగ్ లోకేషన్ లో ఎత్తైన ప్రదేశం నుంచి జారిపడి ఆయన గాయపడ్డాడు. ప్రస్తుతం గోపీచంద్ 30వ చిత్రాన్ని శ్రీవాస్ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం మైసూర్ లో జరుగుతోంది. డూప్ లేకుండా ఓ ఫైట్ సీన్ లో పాల్గొన్న గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడు.

అయితే ఆయన పరిస్థితి నిలకడగానే ఉందని, అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని డైరెక్టర్ శ్రీవాస్ తెలిపారు. గోపీచంద్ ప్రమాదానికి గురయ్యాడనే వార్తతో ఆయన అభిమానులు ఆందోళనకు గురవుతున్నారు. ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నారు.

కాగా, గోపీచంద్‌ ప్రస్తుతం తన 30వ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. గోపీచంద్‌కి లక్ష్యం, లౌక్యం లాంటి రెండు హిట్స్ అందించిన డైరెక్టర్ శ్రీవాస్ ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు. గోపీచంద్- శ్రీవాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూడో చిత్రం ఇది. తాజా చిత్రంతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.