మూడు రాజధానుల విషయంలో కోర్టుల్లో కేసులు ఉన్నా…ప్రతి పక్ష నేత చంద్రబాబు నాయుడు పనిగట్టుకుని మూడు రాజధాను లు వద్దు..అమరావతి ముద్దు అని మొత్తుకున్నా అది జరిగే పని కాదని గవర్నర్ రాజ ముద్రతోనే తేలిపోయింది. కేంద్రం ఈ విషయంపై ఇప్పటికే స్పష్టమైన సంకేతాలు ఇచ్చేసింది. అయినా మరోసారి ఈ రోజు కూడా అదే మాట చెప్పింది. అదే పరిపాలనా రాజధాని అనేది రాష్ర్టం ప్రభుత్వం ఇష్టం..వాళ్లు ఇష్టం వచ్చిన చోట పెట్టుకునే అధికారం ఉంది. మాకేమి సంబంధం లేదని మరోసారి ఉద్ఘాటించింది. కాబట్టి చంద్రబాబు అండ్ కో భావించినట్లు ఆంధ్రప్రదేశ్ కి ఒకటే రాజధాని..అది అమరావతే కావాలని కలలు కంటోన్న వారందరివి పగటి కలలుగానే మిగిలిపోతాయి.
టీడీపీ కావాలని మానసిక ఆనందం కోసం, ఆత్మ సంతృప్తి కోసం ఏదో అలా అనుకోవడం తప్ప! అందులో సాధ్యాసాధ్యాలు వాళ్లకి తెలియకుండా ఉండవు కదా! అయినా ఇప్పుడు చంద్రబాబు స్వరం కూడా మార్చారు. అమరావతిని వాణిజ్య రాజధాని అనాడే మేము అన్నామని ఈరోజు అన్ని వార్తా పత్రికల్లో కూడా వచ్చింది. అమరావతికి ధీటుగా వైజాగ్ అభివృద్ది చెందుతుందని…ఇంకా చెప్పాలంటే అమరావతి కన్నా వేగంగా స్మార్ట్ సిటీ హోదో లా ఉన్న వైజాగ్, తిరుపతి, కాకినాడ అత్యంత వేగంగా అభివృద్ది చెందుతాయని చంద్రబాబు కవ్వింపు వ్యాఖ్యలకు దిగినట్లు నేటి పత్రికలు చూస్తే తెలుస్తుంది. ఉత్తరాంధ్రలో, రాయలసీమలో చంద్రబాబు ఇప్పుడు ద్రోహిగా మారిపోయాడు.
మూడు రాజధానులకు వ్యతిరేకంగా వైజాగ్ ఎయిర్ పోర్టులో కాలు పెడితే ఏ జరిగిందో చంద్రబాబుకు తెలియదా? అందుకే ఇప్పుడా పరిస్థితుల నుంచి బయటపడటానికి, రాజకీయంగా బలం పుంజుకోవడానికి కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడొస్తున్న కథనాలన్ని వైజాగ్, కర్నూలు జిల్లాల్ని రాజధానిగా వ్యతిరేకించే పచ్చ ప్రయత్నాలు అయి ఉండొచ్చు. లేదా! అవి వ్యక్తిగత ప్రయోజనాల కోసం కావొచ్చు అనేది స్థానిక వైకాపా నేతల్లో చర్చకొచ్చింది. అయితే విశాఖ పరిపాలనా రాజధాని అయితే ప్రశాంతంగా ఉండే సిటీలో గందరగోళం నెలకొంటుంది అన్న వర్గం లేకపోలేదు. కానీ ఆ వర్గం చాలా పరిమితంగానే ఉంది. 10 మంది ఓవైపు 100 మంది మరో వైపు నిలబడితే ఎలా ఉంటుందో తెలిసిందేగా. మరి వీటన్నింటిని అధిగమించి చంద్రబాబు విశాఖ నడిబొడ్డున జై అమరావతి అనిపిస్తే గ్రేట్ అని అనాల్సిందే.