ఏదో సామెత చెప్పినట్టు జగన్ సర్కార్ 90 మంచి పనులు చేసినా పది చెడ్డ పనులతో పరువు పోగొట్టుకుంటోంది. తాజాగా జగన్ సభకు వచ్చిన మహిళలకు చున్నీలు లేకుండా రావాలని విధించిన నిబంధనపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నల్ల చున్నీలు ధరించిన మహిళలకు జగన్ సర్కార్ ఈ నిబంధనలను అమలు చేసింది. అయితే జగన్ భయంతో ఈ తరహా రూల్స్ ను అమలు చేస్తున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
జగన్ సర్కార్ వ్యవహరించిన తీరు విషయంలో తీవ్రస్థాయిలో విమర్శలు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ప్రజల్లో వ్యతిరేకత వచ్చే నిర్ణయాలకు వైసీపీ సర్కార్ దూరంగా ఉంటే మంచిది. ఇతర పార్టీలు ఏ మాత్రం విమర్శలు చేయకుండా ఉండేలా జగన్ సర్కార్ అడుగులు వేస్తే బాగుంటుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. మహిళల విషయంలో జగన్ సర్కార్ చేసే చిన్నచిన్న పొరపాట్లు పార్టీకి తీవ్రస్థాయిలో మైనస్ అవుతున్నాయి. జగన్ సర్కార్ ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా కొన్ని తప్పులు ఆ పార్టీపై ప్రజల్లో అసహ్యం కలిగేలా చేస్తున్నాయి.
జగన్ సర్కార్ తీసుకుంటున్న కొన్ని నిర్ణయాల గురించి వింటే ఈ నిర్ణయాలు జగన్ కు తెలిసే అమలులోకి వచ్చాయా? లేక ఆయన పరువు తీయాలని ఎవరైనా ఈ నిర్ణయాలను అమలు చేసే ప్రయత్నం చేశారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వింత నిర్ణయాలే జగన్ సర్కార్ పాలిట శాపంగా మారాయని మరి కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తుండటం హాట్ టాపిక్ అవుతోంది.
జగన్ సర్కార్ ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుందని మరి కొందరు సూచనలు చేస్తుండటం గమనార్హం. జగన్ సర్కార్ వైరల్ అవుతున్న నెగిటివ్ విమర్శల గురించి కూడా స్పందించే అవకాశం లేదని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.