2019 ఎన్నికల్లో వైసీపీ ఎన్నికల్లో పోటీ చేసిన అందరు తమ గెలుపు ఖాయమనుకున్నారు. ఎందుకంటే ఎన్నికల ముందు జగన్ రాష్ట్రంలో జగన్ కు ఉన్న క్రేజ్ అలాంటిది. కానీ కొంతమంది నాయకులు మాత్రం ఓటమి తప్పలేదు. ఎన్నికల్లో వైసీపీకి చెందిన 24 మంది అభ్యర్థులు ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే ఎన్నికల్లో ఓడిపోయిన నాయకులే ఇంకా ఆ స్థానాల్లో పార్టీ ఇంచార్జ్ లుగా వ్యవహరిస్తున్నారు.
యితే ఓడిపోయిన వైసీపీ నాయకుల్లో ఇప్పుడు అసంతృప్తి వ్యక్తమవుతోంది. తమను జగన్ పట్టించుకోవడం లేదని, కనీసం కలవడానికి అవకాశం కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత కొంతమంది నాయకులకు మాత్రం మంచే జరిగింది. జగన్ అధికారంలోకి వచ్చి 14 నెలలు కావస్తుంది. అయితే ఓటమి పాలయిన అభ్యర్థుల్లో ద్రోణంరాజు శ్రీనివాస్ కు విశాఖ మెట్రో అర్బన్ డెవెలెప్ మెంట్ అధారిటీ ఛైర్మన్ ఇచ్చారు. హిందూపురంలో ఓటమి పాలయిన మహ్మద్ ఇక్బాల్ కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. గన్నవరం నియోజకవర్గంలో ఓటమి పాలయిన యార్లగడ్డ వెంకట్రావుకు డీసీఎంస్ ఛైర్మన్ పదవి ఇచ్చారు. అయితే మిగిలిన చోట్ల ఓటమి పాలయిన అభ్యర్థుల విషయంలో మాత్రం జగన్ ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. మోపిదేవి వెంకటరమణ, పిల్లి సుభాష్ చంద్రబోస్ లకు మంత్రి పదవులు ఇచ్చి, తర్వాత రాజ్యసభకు పంపారు. అయితే పార్టీ తరపున ఓడిపోయిన 14మంది నాయకులు మాత్రం జగన్ ను ఇప్పటి వరకు కలవడం కూడా జరగలేదు. తాము ఎన్నికల్లో కొన్ని కోట్ల డబ్బులు ఖర్చు చేశామని, తమ ఆర్థిక పరిస్థితి కూడా మంచిగా లేదని, జగన్ మాత్రం పట్టించుకోకపోవడం వల్ల తమ పరిస్థితి దీనంగా ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జగన్ పాదయాత్ర సమయంలోనూ తమ నియోజకవర్గానికి వచ్చినప్పుడు పెద్దయెత్తున ఖర్చు చేశారు. అయితే వీరంతా పార్టీలో అధికారంలోకి రాగానే తమ పరిస్థితి బాగుపడుతుందనుకున్నారు. ఆర్థికంగా నిలదొక్కుకుంటామనుకున్నారు.
అయితే జగన్ అధికారంలోకి వచ్చిన తరువాత సంక్షేమ పథకాలపై దృష్టి పెడుతూ, అభివృద్ధి పనులను పట్టించుకోవడం లేదు. దీంతో ఓడిపోయిన నాయకులు ఆర్థికంగా కూడా లాభపడటం లేదు. చంద్రబాబు కాలంలో నియోజకవర్గ ఇన్ ఛార్జి అన్నా ఎమ్మెల్యే తరహాలో వ్యవహరించేవారు. ఇప్పుడు అభివృద్ధి పనులు కూడా లేకపోవడంతో ఇన్ ఛార్జిగా ఉన్నా ప్రయోజనం లేదని వీరు పెదవి విరుస్తున్నారు. ఒక ఏడాది మొత్తం సంక్షేమంతో నెట్టుకొచ్చిన జగన్ ఈ ఏడాది అభివృద్ధికి నిధులు కేటాయిస్తారేమోనన్న ఆశతో ఉన్నారు. ఓడిన తమ కోసం జగన్ పార్టీలో ఓదార్పు యాత్ర చేస్తారో లేదోనని ఓడిన వైసీపీ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.