ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కొందరు జడ్జిల మీద చేసిన ఫిర్యాదు.. భారత న్యాయవ్యవస్థనే ప్రశ్నించేలా ఉంది. ఆయన చేసిన ఫిర్యాదుతో న్యాయవ్యవస్థలో ఒక్కసారిగా కుదుపు మొదలైంది. ఇద్దరు సీనియర్ న్యాయమూర్తులపై జగన్ చేసిన ఫిర్యాదుపై సుప్రీం చీఫ్ జస్టిస్ బాబ్డే తాజాగా విచారణ ప్రారంభించారు.
సుప్రీం చీఫ్ జస్టిస్ కు అక్టోబర్ 6న జగన్ లేఖ రాసిన విషయం తెలిసిందే. ఆ లేఖలో సుప్రీం జస్టిస్ ఎన్వీ రమణతో పాటు.. హహఐకోర్టు చీఫ్ జస్టిస్ మహేశ్వరిత్, మరికొందరు న్యాయమూర్తులు.. కావాలని ప్రభుత్వానికి వ్యతిరేకంగా తీర్పులను వెలువరించారని జగన్ ఆరోపించారు.
జగన్ ఫిర్యాదు మేరకు.. జస్టిస్ బాబ్డే విచారణ ప్రారంభించడంతో పాటు.. జగన్ ఆరోపిస్తున్న ఆ ఇద్దరికి కూడా బాబ్డే నోటీసులు పంపించినట్టు సమాచారం. అలాగే.. లేఖతో పాటు అఫిడవిట్ ను కూడా సమర్పించాలంటూ జగన్ కు బాబ్డే సమాచారం అందించారట. వెంటనే జగన్ కూడా స్పందించి అఫిడవిట్ పంపించినట్టు సమాచారం.
నోటీసులకు బదులుగా జస్టిస్ ఎన్వీ రమణతో పాటు మహేశ్వరిత్ పంపిన వివరణలపై చీఫ్ జస్టిస్ అంతగా సంతృప్తి చెందలేదని… మరి వాళ్ల వివరణ ఆధారంగా బాబ్డే ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో అనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశమైంది.
జగన్ ఫిర్యాదు చేసిన తర్వాతనే మహేశ్వరిత్ ను సిక్కింకు బదిలీ చేశారని వార్తలు వచ్చాయి. ఎన్వీ రమణపై మాత్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అందులోనూ త్వరలో ఎన్వీ రమణ.. సుప్రీం చీఫ్ జస్టిస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. ఈనేపథ్యంలో జగన్ ఫిర్యాదు చేయడం.. న్యాయవ్యవస్థలోనే పెద్ద కుదుపులా అయింది. చూద్దాం.. ఈ కేసు ఎన్ని మలుపులు తిరుగుతుందో?