పరిపాలనలో జగనన్నని కొట్టేది ఎవరు? సంక్షేమ ఫలాలు అందించడంలో ఖ్యాతికెక్కింది ఏ సీఎం? అంటే టక్కున గొర్తొచ్చే ఒకే ఒక్క పేరు జగన్ మోహన్ రెడ్డి. ఏడాదిన్నర పాలనలో ఆరంభంలో కాస్త తడబడినప్పటికీ ఆ ఒడిదుడుకులన్నింటిని దాటుకుంటూ ముందుకు సాగిపోతున్నారు. సంక్షేమ ఫలాలు అందించడంలో జగన్ ది గ్రేట్ అంటూ కేంద్రమే కితాబిచ్చింది..పక్క రాష్ర్టాల సీఎంలే జగన్ వైపు చూసారంటే? పాలన బేషుగ్గా ఉందనేగా. ఏడాది పాలనలో ఇచ్చిన మాటను..చేసిన వాగ్ధానాన్నినెరవేర్చి జగన్ దాదాపు చివర ఘట్టానికి చేరుకున్నారు.
మెనిఫెస్టో లో లేని కొత్త పథకాలను తీసుకొచ్చి..పార్టీలతో సంబంధం లేకుండా…ప్రతిపక్షంతో పనిలేకుండా…తన మన అన్న తారతమ్యం లేకుండా..జగన్ కి ఓటు వేసినా..వేయకపోయినా అందరికీ ఫలాలు అందించేలా జగన్ యంత్రాంగం పనిచేసింది. ఇక నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో తండ్రి, దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డినే మించిపోయారు. వస్తూనే లక్షల్లో నోటిఫికేషన్లు జారీ చేసి సంచలనానికి తెరలేపారు. నాటి నుంచి యువత ఉపాధే లక్ష్యంగా కంకణం కట్టుకున్నారు. తాజాగా 9620 వాహనాలు కొని ఇవ్వడానికి రంగం సిద్దం చేస్తోంది. ప్రభుత్వం నాణ్యమైన బియ్యాన్ని లబ్ధిదారులకు ఇంటికే చేరవేయాలని నిర్ణయించిన నేపథ్యంలో ఆర్ధిక భారం తగ్గించుకునే దిశగా చర్యలు ప్రారంభించింది.
ఈ నేపథ్యంలో కొత్త వాహనాలు కొనుగోలు చేసి స్వయం ఉపాథి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, ఈబీసీ నిరుద్యోగులకు వాటి బాధ్యత అప్పగించనుంది. వాహనాల కొనుగోలుకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం లోన్ ప్రభుత్వం అందిస్తుంది. మిగిలిన 10 శాతం చెల్లించి యువత వాహనం సొంతం చేసుకోవచ్చు. నేరుగా లబ్దిదారుడి పేరు మీదనే వాహనం రిజిస్టర్ అవుతుంది. ఈ మొత్తం అన్ని ఖర్చులు కలిపి బియ్యం డోర్ డెలివిరీ చేయడానికి 776.45 కోట్లు అదనపు నిధులుగా మంజూరు చేసారు. మొత్తానికి కష్ట కాలంలో మోదీ సైతం చేయని సాహసాల్ని ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి చేస్తున్నారు. కరోనా లాంటి కష్టకాలంలోనూ జగన్ డేరింగ్ డెసిషన్లు రియల్లీ షాకింగే.