కరోనా కేసులపై రాష్ట్రాలకు కేంద్రం హెచ్చరిక !

దేశంలోని కొన్ని ప్రాంతాల్లో వేగంగా పెరుగుతున్న కరోనా వైరస్ కేసుల దృష్ట్యా, ప్రజలు ఫేస్ మాస్క్‌లు ధరించడం, పరిశుభ్రత మరియు సామాజిక దూరం వంటి కోవిడ్ ప్రోటోకాల్స్ ని ప్రజలు పాటించేలా చూడాలని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్ర ప్రభుత్వం కోరింది. అన్ని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు రాసిన లేఖలో ఈ అంశాలను ప్రస్తావించారు.

coronavirus

ఈ లేఖ రాసిన కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా కోవిడ్ ప్రోటోకాల్స్ ని ప్రోత్సహించడానికి మరియు ప్రజలు ఫేస్ మాస్క్‌లు ధరించేలా, పరిశుభ్రత పాటించేలా అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించారు.ఈ చర్యలు నేషనల్ డైరెక్టివ్స్ ఫర్ కోవిడ్ -19 మేనేజ్‌మెంట్‌లో కూడా చేర్చబడ్డాయని, వీటిని దేశవ్యాప్తంగా ఖచ్చితంగా పాటించాలని ఆయన పేర్కొన్నారు.

ఈ “కోవిడ్ ప్రోటోకాల్ ని ప్రజలు, ముఖ్యంగా రద్దీ ప్రదేశాల్లో పాటించడం లేదని గమనించామన్న ఆయన పెరుగుతున్న కేసుల సంఖ్య అలానే రాబోయే పండుగల నేపధ్యుంలో ఈ మార్గదర్శకాలను పాటించడం మరియు ఫేస్ మాస్క్‌లు ధరించడం, పరిశుభ్రత పాటించడం, సామాజిక దూరం పాటించడం వంటి అంశాలు ఖచ్చితంగా అమలు చేయడం చాలా ముఖ్యం అని ఆయన అన్నారు. వీటిని అనుసరించడానికి ప్రజలలో అవగాహన కల్పించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని, అదే సమయంలో మహమ్మారిని పూర్తిగా అధిగమించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను” అని హోం కార్యదర్శి తెలిపారు.

ఈమధ్య ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మరో మాట కూడా ఉన్నారు. ప్రజలను ఇబ్బంది పెట్టవద్దు. అంటే… కరోనా రూల్స్ పాటించేలా చేస్తూనే… ప్రజలకు మరీ అసౌకర్యం కలగకుండా జాగ్రత్తగా వ్యవహరించాలని రాష్ట్రాలను కోరారు. సో… రాష్ట్రాలు ఇప్పుడు లాక్‌డౌన్లు పెట్టకపోవచ్చు గానీ… మహరాష్ట్ర తరహాలో… మాస్కులు పెట్టుకోని వారికి భారీ ఫైన్లు వేసే నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే… కరోనా ఆగాలంటే… అన్నింటికంటే ముఖ్యమైనదిగా మాస్కే కనిపిస్తోంది. మాస్క్ వాడేవారికి కరోనా అంతగా సోకట్లేదు. మిగతా అందరికీ సోకుతోంది. కాబట్టి… రాష్ట్రాలు ఈ దిశగా చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.