విజయేంద్ర ప్రసాద్ పై అసలు నిజం బయటపెట్టిన నరేంద్ర మోడీ.!

ఒక్క తెలుగు సినిమాలోనే కాకుండా ఇండియన్ సినిమా దగ్గర కూడా తన కథలతో భారీ మార్కెట్ ఉన్న సినిమాలను అందించిన స్టార్ రచయిత ఎవరైనా ఉన్నారు అంటే అది డెఫినెట్ గా దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి తండ్రి వి విజయేంద్ర ప్రసాద్ అనే చెప్పాలి.

రాజమౌళి చేసిన అన్ని సినిమాలకు అలాగే హిందీలో కూడా పలు సినిమాలకు కథలు అందించిన విజయేంద్ర ప్రసాద్ కి దేశ ప్రభుత్వం రాజ్య సభలో సీటిచ్చి గౌరవాన్ని అందించింది. దీనితో తెలుగు సినిమాకి గర్వకారణంగా మారగా అనేకమంది ప్రముఖులు కూడా ఈ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

అయితే ఇదిలా ఉండగా అసలు విజయేంద్ర ప్రసాద్ కి ఎందుకు ఈ గౌరవం ఇవ్వాల్సి వచ్చిందో దేశ ప్రధాని నరేంద్రమోడీ రివీల్ చేశారు. “శ్రీ వి.విజయేంద్ర ప్రసాద్ గారు దశాబ్దాలుగా సృజనాత్మక రంగంతో ప్రత్యేక అనుబంధం కలిగి ఉన్నారు.

అతని రచనలు భారతదేశం యొక్క అద్భుతమైన సంస్కృతిని ప్రతిబింబిస్తూ ప్రపంచవ్యాప్తం గా ఒక ప్రత్యేక గుర్తంపును తీసుకువచ్చాయి. అతను రాజ్యసభకు నామినేట్ అయినందుకు నా అభినందనలు.” అని అసలు విషయం బయటపెట్టారు.

భారత దేశ సంస్కృతిని తన రచనలు ద్వారా సినిమాలతో ప్రపంచ స్థాయిలో నిలబెట్టినందుకు గాను విజయేంద్ర ప్రసాద్ కి ఈ గౌరవాన్ని కట్టబెట్టినట్టుగా తెలిపారు. మరి దీనికి కారణం అయితే ప్రధానంగా బాహుబలి మరియు RRR సినిమాలే అని చెప్పి తీరాలి.