ఎవ్వరికీ ఇవ్వని బృహత్తర బాధ్యత ని ఆ మినిస్టర్ కి అప్పజెప్పిన జగన్ .. ! 

ys jagan to meet amit shah in delhi

 

ఏపీలో వైసీపి అధికారంలోకి వచ్చాక సీయం జగన్‌కు పాలన పరమైన ఇబ్బందులతో పాటుగా, సొంత పార్టీ వారినుండి ఎన్నో ఇబ్బందులు తలెత్తుతున్న విషయం తెలిసిందే. అదీగాక వైసీపీలో గ్రూపు రాజకీయాలు చేస్తున్న వారు ప్రతి నియోజక వర్గంలో ఉన్నారు.. ఇలాంటి ఆధిపత్య పోరు వైఎస్ జగన్‌కు ఎన్నో తలనొప్పులను తెస్తుంది.. ఇక అధికార పార్టీలోని పరిస్దితిని చూస్తే కరవమంటే కప్పకు కోపం, విడిచి పెట్టమంటే పాముకు కోపం అన్న తీరుగా ఉందట.. ప్రజా సమస్యలు ఒకవైపు, పార్టీ నాయకుల తీరు మరొక వైపు వైస్ జగన్‌ను కొంత ఇబ్బందికి గురిచేస్తుందంటున్నారు..

ఇక నెల్లూరు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేల మధ్య ఆధిపత్యపోరు ఒకగానొక సమయంలో తారా స్దాయికి చేరిందన్న విషయం విదితమే.. ఈ సమస్య వైఎస్ జగన్ దృష్టికి కూడా వెళ్లింది.. అందుకే తాజాగా నెల్లూరు జిల్లాలో పార్టీలో నెలకొన్న వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టే పనిలో పడ్డారు. ఇకపోతే ఇది వరకే జిల్లాల్లో అనేక చోట్ల వివాదాలను పరిష్కరించేందుకు నలుగురిని నియమించినా, నెల్లూరు జిల్లా వివాదాలను పరిష్కరంచే బాధ్యతను మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి, సీయం జగన్ అప్పగించినట్లు తెలుస్తోంది. దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డి రంగంలోకి దిగి వివాదాలను పరిష్కరించే దిశగా ప్రయత్నాలను ప్రారంభించారని సమాచారం..

 

నిజానికి వైఎస్ జగన్, మేకపాటి గౌతమ్ రెడ్డి అప్పగించిన బాధ్యత కత్తి మీద సాములాంటిదని, మరి వివాదాలకు దూరంగా ఉంటూ, తన పని తాను చేసుకుంటూ, ఎవరి మనస్సును నొప్పించని మనస్తత్వం ఉన్న మేకపాటి గౌతమ్ రెడ్డికి, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని పార్టీలో నెలకొన్న విభేదాలను పరిష్కరించాలనే పెద్ద టాస్క్ వైఎస్ జగన్ అప్పగించారు.. దీంతో మేకపాటి గౌతమ్ రెడ్డి గత కొద్ది రోజులుగా నెల్లూరు జిల్లా వైసీపీ నేతలతో సమావేశం అవుతున్నారట. అసలే రాజకీ అసంతృప్తులతో రగులుతున్న నెల్లూరు జిల్లాలో నెలకొన్న వివాదాలను మేకపాటి గౌతమ్ రెడ్డి పరిష్కరించే దిశగా అడుగులు వేస్తున్నారట.. ఇకనైనా ఈ గ్రూపు రాజకీయాలకు తెరపడుతుందా లేదా అనేది తెలియాలంటే కాస్త ఆగవలసిందే..