తాజాగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి జగన్మోహన్ ప్రభుత్వంపై తన ట్విట్టర్ వేదికగా విమర్శలు చేశారు. జగన్ ప్రభుత్వం పై నమ్మకం లేకే విలీన గ్రామాల ప్రజలు తమను తెలంగాణలో కలపాలి అని కోరుకుంటున్నారని అన్నారు. విలీన మండలాల్లో విద్యుత్ సరఫరా, తాగునీరు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు అని అన్నారు.
వరదలో వచ్చిన బురదను, రహదారులపై కూలీల చెట్లను తొలగించే ప్రయత్నం చేయటం లేదు అని.. వారం క్రితమే వరదలు తగ్గినా కూడా ఇప్పటికీ విద్యుత్ సరఫరా, రాకపోకలను ఎందుకు పునరుద్దరించలేకపోయారు అని ప్రశ్నించారు. వరద బాధితులకు సహాయం అందకనే తాము తమ గ్రామాలను తెలంగాణలో కలపాలని డిమాండ్ చేస్తున్నారని.. దీనికి కారణం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కాబట్టి ప్రభుత్వం పూర్తి బాధ్యత వహించాలి అని అన్నారు.