విశాఖ నుంచి పాలన.. ఏపీ సీఎం జగన్ పంతం నెగ్గినట్టేనా?

మరో 15 నెలల్లో ఏపీలో ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల సమయానికి రాజధాని విషయంలో స్పష్టత లేకపోతే ప్రజల్లో నెగిటివ్ ఒపీనియన్ కలుగుతుందని సీఎం జగన్ కు సైతం తెలుసు. ఈ రీజన్ వల్లే విశాఖ నుంచి పాలనను మొదలుపెట్టే దిశగా సీఎం జగన్ అడుగులు వేస్తున్నారు. ఏపీ రాజధాని విషయంలో ఒక విధంగా జగన్ తన పంతాన్ని నెగ్గించుకున్నారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

ఎక్కడినుంచి అయినా సీఎం పరిపాలన సాగించవచ్చని చెబుతూ వచ్చే ఏడాది నుంచి విశాఖ క్యాపిటల్ గా పాలనను మొదలుపెట్టడానికి జగన్ సిద్ధమవుతున్నారు. మూడు రాజధానులకే జనం ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో జగన్ ఈ నిర్ణయం విషయంలో ఫిక్స్ అయ్యారు. మూడు రాజధానులను ప్రకటించడం వల్ల తమ జిల్లాలకు అంతోఇంతో మేలు జరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు.

తమ జిల్లాల అభివృద్ధి జరిగితే తమకు ఎంతో మంచి జరుగుతుందని వాళ్లు భావిస్తున్నారు. అయితే రాజధానికి సంబంధించిన కేసు సుప్రీం కోర్టు పరిధిలో ఉండటంతో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది. విశాఖ నుంచి పాలన మొదలైతే మాత్రం జగన్ అనుకున్నది సాధించినట్టే అవుతుందని కామెంట్లు వినిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.

టీడీపీ, జనసేన నుంచి ఎన్ని విమర్శలు వచ్చినా మూడు రాజధానుల విషయంలో వెనుకడుగు వేయకూడదని జగన్ ఫిక్స్ అయ్యారు. ప్రజల నుంచి మద్దతు లభిస్తున్న నేపథ్యంలో వెనుకడుగు వేయడం వల్ల నష్టం తప్ప లాభం ఉండదని ఆయన భావిస్తున్నారని తెలుస్తోంది. మూడు రాజధానుల దిశగా జగన్ అడుగులు వేయడంపై ప్రజల నుంచి కూడా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి.