దీపావళి కి కనీ వినీ ఎరుగని గిఫ్ట్ ఇచ్చిన జగన్ – కాపులకి మాత్రమే !

cm jagan mohan redy

 జగన్ ముఖ్యమంత్రి కాకముందు ప్రతిపక్ష నేత హోదాలో రాష్ట్ర వ్యాప్తంగా మూడు వేలకు పైగా కిలోమీటర్లు పాదయాత్ర చేశాడు , ఇందులో ముఖ్యంగా అన్ని కులాల వారిని కలిసి వాళ్ళ కష్టనష్టాలు గురించి తెలుసుకొని, వాళ్ళకి తగ్గ న్యాయం చేస్తానని మాట ఇచ్చాడు. అందులో భాగంగా కులాల వారీగా కార్పొరేషన్స్ ఏర్పాటు చేస్తున్నాడు , ఇక ముఖ్యమైన కాపు కులం విషయంలో జగన్ ఒక సృష్టమైన వైఖరితో ముందుకు వెళ్తున్నాడు.

cm jagan mohan redy

 గతంలో చంద్రబాబు బీసీ రిజర్వేషన్ అంటూ మాయ మాటలు చెప్పి, ఎన్నికల్లో విజయం సాధించి, ఆ తర్వాత దానిని పక్కనపెట్టి బీసీ లను మోసం చేశాడు ,. కానీ జగన్ ఎన్నికలకు ముందే బీసీ రిజర్వేషన్ అనేది నా చేతిలో లేని పని, కాబట్టి వాళ్ళను మరో విధంగా ఆదుకుంటానని చెప్పాడు. అప్పట్లో జగన్ స్టేట్మెంట్ మీద అనేక ఆరోపణలు వచ్చిన కానీ, అదే ముమ్మాటికీ నిజం… ఇక జగన్ మాట ఇచ్చిన ప్రకారం కాపు నేస్తం అనే పధకాన్ని ప్రవేశపెట్టాడు. ఇందులో భాగంగా గతంలో ఒక విడత కాపు నేస్తం కూడా అర్హత కలిగిన వాళ్లకు నిధులు విడుదల చేశాడు.

 ఇప్పుడు తాజాగా కాపు నేస్తం పథకానికి అర్హులైనా సరే లబ్ది చేకూరని వారి జాబితాను ప్రభుత్వం సిద్ధం చేసింది. కొత్తగా 95,245 మందికి కాపు నేస్తం వర్తిస్తుంది. కొత్త లబ్దిదారులకు రూ. 142.87 కోట్ల మేర నిధుల విడుదల చేసారు. కాపు నేస్తం కొత్త లబ్దిదారులకు నిధులు విడుదల చేసారు మంత్రి చెల్లుబోయిన వేణు, కాపు కార్పోరేషన్ ఛైర్మన్ జక్కంపూడి రాజా.చేసేదే సీఎం జగన్ చెబుతారు అని అర్హులైన లబ్దిదారులకు గుర్తించి నిధుల విడుదల చేస్తున్నామని జక్కంపూడి రాజా తెలిపాడు.

 మాజీ సిఎం చంద్రబాబు నాయుడు చంద్రబాబు కాపు రిజర్వేషన్ల విషయంలో భ్రమలు కల్పించారు అని, పేదలకు భూములివ్వాలంటే చంద్రబాబు కోర్టుల ద్వారా అడ్డుకుంటున్నారని, జగన్ యఙం చేస్తోంటే.. చంద్రబాబు రాక్షసుడి మాదిరి అడ్డుకుంటున్నారు అని ఆయన విమర్శలు చేసారు. చంద్రబాబు హయాంలో సంక్షేమ పథకం పొందాలంటే కిరి కిరి కమిటీలు చుట్టూ తిరగాల్సి వస్తోంది అని ఆయన విమర్శలు చేసారు. కానీ జగన్ పాలనలో లబ్దిదారులను వెతికి లబ్ది చేకూరుస్తున్నారని మంత్రి చెల్లుబోయిన వేణు మాట్లాడటం జరిగింది. అయితే ఇలాంటి దీపావళి కానుకలు కేవలం కాపులకేనా లేక మిగతా బీసీ కులాలకు ఇచ్చే ఆలోచన ఏమైనా ఉందా..? అంటూ మిగిలిన బీసీ కులాలు కామెంట్స్ చేస్తున్నాయి