AP: పవన్ పై జగన్ సంచలన వ్యాఖ్యలు…స్ట్రాంగ్ రిప్లై ఇచ్చిన లోకేష్?

AP: వైయస్ జగన్మోహన్ రెడ్డి నిన్న ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా కూటమి ప్రభుత్వాన్ని విమర్శిస్తూ ప్రశ్నలు వేశారు. ఇచ్చిన హామీలన్నీ తుంగల్లో తొక్కారని ప్రజలను మోసం చేశారు అంటూ ప్రభుత్వం పై విమర్శలు కురిపించారు. ఇక వైసిపికి ప్రతిపక్ష నేత హోదా గురించి గతంలో పవన్ అన్న వ్యాఖ్యల గురించి రిపోర్టర్స్ జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు జగన్ సమాధానం చెబుతూ.. ఆ మనిషి కార్పొరేటర్ కు ఎక్కువ ఎమ్మెల్యేకు తక్కువ జీవితకాలంలో మొదటిసారి ఎమ్మెల్యే అయ్యారు కదా అంటూ మాట్లాడటంతో ఈ వ్యాఖ్యలను కూటమినేతలు పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. ఇక ఈ వ్యాఖ్యలపై ఇప్పటికే జనసైనికులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే నారా లోకేష్ కూడా పవన్ గురించి జగన్ చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ గట్టిగా సమాధానం చెప్పారు.

మంత్రి నారా లోకేష్ శాసనసభ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ, అహంకారానికి ఫ్యాంట్, చొక్కా తొడిగితే అది జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా మంత్రిగా ఎంతో బాధ్యతగా విధులు నిర్వహిస్తున్న పవన్ కళ్యాణ్ గురించి జగన్ ఇలా మాట్లాడటం ఆయన అహం భావానికి నిదర్శనం అని తెలిపారు. ఇందుకే ప్రజలు ఆయనకు కనీసం ప్రతిపక్ష నాయకుడు హోదా కూడా ఇవ్వలేదు. సొంత తల్లిని, చెల్లినే గౌరవించనివాడు ఇతరులను గౌరవిస్తారని ఎలా అనుకుంటాము.

జగన్మోహన్ రెడ్డికి పవన్ కళ్యాణ్ ను విమర్శించే స్థాయి లేదని తెలిపారు. పులివెందుల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయిన జగన్మోహన్ రెడ్డికి తొలిసారి పిఠాపురం నుంచి పోటీ చేసిన పవన్ కళ్యాణ్ కి ఎంత మెజారిటీ వచ్చిందనే విషయాన్ని జగన్ గుర్తించాలని లోకేష్ తెలిపారు. జగన్‌ చెప్పినట్టు మా కూటమి ప్రభుత్వం నడుచుకోవాలంటే కుదరదు. ఒకవేళ ఏమైనా చెప్పాలనుకుంటే ధైర్యంగా శాసనసభకు వచ్చి చెపితే మేమూ ఆయనకి తగిన సమాధానం చెబుతాము అంటూ జగన్ వ్యాఖ్యలపై లోకేష్ తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపించారు.