కొందరు నాయకులు పార్టీ పేరు చెప్పుకొని గెలుస్తారు. మరికొందరు పార్టీ కన్నా తమకు ఉన్న పాపులారిటీతో గెలుస్తారు. 2019 ఎన్నికల్లో జరిగింది అదే. టీడీపీ.. ఆ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయినా… కొందరు టీడీపీ అభ్యర్థులు మాత్రం బంపర్ మెజారిటీతో గెలిచారు. దానికి కారణం వాళ్లకు ఉన్న ప్రజాదరణ. సొంత ఇమేజ్ ఉంటే ఎవ్వరు వచ్చినా ఏం చేయలేరు. అలాంటి వారిలో రామ్ మోహన్ నాయుడు ఒకరు.
2019 లో వచ్చిన జగన్ సునామీని తట్టుకొని మరీ నిలబడిన నేత రామ్మోహన్ నాయుడు. శ్రీకాకుళం నుంచి రెండు సార్లు ఎంపీగా గెలిచారు. 2014తో పాటు 2019 లోనూ ఆయన ఎంపీగా గెలిచి తన సత్తా చాటారు. రామ్మోహన్ నాయుడు ఎంపీ అవ్వడమే కాదు.. ఉత్తరాంధ్ర ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలంటూ పార్లమెంట్ లోనే ఏకంగా కేంద్రాన్నే చాలాసార్లు నిలదీశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం కూడా రామ్మోహన్.. పార్లమెంట్ లో ప్రశ్నించిన సందర్భాలు అనేకం. అందుకే.. శ్రీకాకుళం జిల్లాలో రామ్మోహన్ నాయుడుకు అంత పాపులారిటీ.
కానీ.. శ్రీకాకుళం జిల్లాలో పాగా వేయాలని వైసీపీ తెగ ఆశపడుతోంది. దాని ఆశ నెరవేరాలంటే రామ్మోహన్ నాయుడుకు చెక్ పెట్టాలి. అందుకే.. సీఎం జగన్ శ్రీకాకుళం జిల్లాపై స్పెషల్ ఫోకస్ పెట్టారట. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో రామ్మోహన్ నాయుడును గెలవకుండా చేసేందుకు ఇప్పటి నుంచే వ్యూహాలను రచిస్తున్నారట. చూద్దాం మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో?