Jabardasth: జబర్దస్త్ కార్యక్రమంలోకి కొత్త యాంకర్… రష్మికు ఇలా చెక్ పెట్టేసారా?

Jabardasth: బుల్లితెరపై ప్రసారమవుతున్నటువంటి కామెడీ షో లలో జబర్దస్త్ కార్యక్రమం ఒకటి. ఈ కార్యక్రమం దాదాపు దశబ్ద కాలం పైగా ప్రసారమౌతూ ప్రేక్షకులను కడుపుబ్బ నవ్వించడమే కాకుండా ఎంతోమంది ఆర్టిస్టులను ఇండస్ట్రీకి పరిచయం చేసింది. ఇలా జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంది ప్రస్తుతం ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఒకప్పుడు వారంలో రెండు రోజులు పాటు వచ్చే ఈ కార్యక్రమాన్ని ఒక రోజుకి కుదించారు. ప్రస్తుత ఈ కార్యక్రమానికి రష్మీ యాంకర్ గా వ్యవహరిస్తున్నారు.

ఇకపోతే తాజాగా ఈ కార్యక్రమానికి సంబంధించిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు ఇందులో భాగంగా జబర్దస్త్ కార్యక్రమం సరికొత్తగా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని తెలియజేశారు. జడ్జిగా వ్యవహరిస్తున్న కుష్బూ ఇకపై జబర్దస్త్ కార్యక్రమంలో అన్ని డబల్ ఉండబోతున్నాయని చెబుతారు. ఇప్పటివరకు ఈ కార్యక్రమం ఆడియన్స్ వద్దకు వెళ్లిది.. ఇప్పుడు ఈ కార్యక్రమంలోని ఆడియన్స్ ఉండబోతున్నారని తెలిపారు.

అంతేకాకుండా ఈ కార్యక్రమంలో అన్ని డబల్ అని చెప్పడంతో మరి యాంకర్ కూడా డబల్ గానే ఉండాలి కదా అంటూ కుష్బూ షాక్ ఇస్తుంది. దీంతో నన్ను తట్టుకునే వారు ఎవరున్నారు అంటూ రష్మీ మాట్లాడటంతో వెంటనే ఒక మేల్ యాంకర్ ని తీసుకురాబోతున్నట్టు చూపించారు కానీ అతని ఫేస్ మాత్రం రివీల్ చేయలేదు. అయితే ఆయన వ్యవహార శైలి తన లుక్, వాకింగ్ స్టైల్ అన్ని చూస్తుంటే మాత్రం కచ్చితంగా సుడిగాలి సుదీర్ ని తిరిగి ఈ కార్యక్రమంలోకి తీసుకురాబోతున్నారని స్పష్టమవుతుంది. ఇక రష్మీ పక్కన సుధీర్ యాంకర్ గా ఉంటే మాత్రం ఈ కార్యక్రమానికి మంచి రేటింగ్ వస్తదని చెప్పాలి సుధీర్ రష్మీ జంటకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇలా మరోసారి సుధీర్ జబర్దస్త్ కార్యక్రమంలో కనిపిస్తే ఈ కార్యక్రమానికి మరింత ఆదరణ పెరుగుతుందని చెప్పాలి. మరి యాంకర్ గా సుధీర్ రీ ఎంట్రీ ఇస్తున్నారా లేదా అనేది తెలియాలి అంటే పూర్తి ఎపిసోడ్ ప్రసారమయ్యే వరకు ఎదురు చూడాలి.