ఆ విషయంలో షాకింగ్ డెసిషన్ తీసుకున్న జబర్దస్త్ నిర్వాహకులు?

గత తొమ్మిది సంవత్సరాల క్రితం బుల్లితెరపై ప్రసారమైన జబర్దస్త్ కార్యక్రమం విశేషంగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ షో ప్రారంభం దశలో కొంత విమర్శలు ఎదుర్కొన్నప్పటికీ రాను రాను ఈ కార్యక్రమానికి విపరీతమైన ఆదరణ పెరిగిపోయింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెంట్ లు చేస్తున్న అద్భుతమైన కామెడీ డైలాగులకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు.అయితే ప్రస్తుతం జబర్దస్త్ కార్యక్రమంలో ఈ కళ తప్పి పోయిందని చెప్పాలి. సీనియర్ కమెడియన్స్ గా ఉన్నటువంటి వారందరూ కూడా ఈ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లిపోతున్నారు.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమంలో సందడి చేయడం కోసం మల్లెమాల వారు తక్కువ రెమ్యూనరేషన్ తో కొత్త వారిని తీసుకు వస్తున్నప్పటికీ వీళ్ళు తమ పంచ్ డైలాగులతో ప్రేక్షకులను ఆకట్టుకోలేక పోతున్నారు.ఇక ఈ కార్యక్రమానికి తరచూ న్యాయనిర్ణేతలు కూడా మారడంతో చాలామంది ఈ కార్యక్రమాన్ని చూడటానికి ఇష్టపడటం లేదు. ఈ కార్యక్రమానికి మొదట్లో నాగబాబు రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరించారు. అయితే ప్రస్తుతం వీరిద్దరూ లేకపోవడంతో జబర్దస్త్ కార్యక్రమానికి కల తప్పిపోయింది.

ఈ క్రమంలోనే ఈ కార్యక్రమ రేటింగ్ అమాంతం పడిపోయాయి.ఒకానొక సమయంలో గంటన్నరపాటు ప్రసారమయ్యే ఈ కార్యక్రమం ప్రస్తుతం అరగంట తగ్గించుకొని కేవలం గంట మాత్రమే ప్రసారమవుతుంది. అలాగే ఈ షోలో చేసే కమెడియన్స్ ఇతర షోలతో బిజీగా ఉండటంవల్ల నిర్వాహకులు ఈ కార్యక్రమం పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. జబర్దస్త్ షోను జనరంజకంగా తీర్చిదిద్దే క్రమంలో తీసుకోవాల్సిన విషయాలపై దృష్టిపెట్టి మరోసారి ఈ కార్యక్రమానికి పూర్వవైభవం తీసుకురావడం కోసం నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు.