ఆ మాజీ మంత్రితో కేసీఆర్ కు కష్టకాలమే

cm kcr telugu rajyam

 తెలంగాణ అధికార పార్టీ తెరాస లో గత ఐదేళ్ల పరిపాలనలో పెద్దగా వర్గ పోరు లేకుండా సాగిపోయింది కానీ, ఈ ధపా మాత్రం చాలా నియోజకవర్గాల్లో వర్గపోరు తీవ్ర స్థాయిలో ఉంది , ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో అవి తారాస్థాయిలో ఉన్నాయి. ఆ జిల్లాకు చెందిన మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు మూలంగా అక్కడ విభేదాలు పెరిగినట్లు తెలుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో కొల్లాపూర్ నుండి పోటీచేసి కాంగ్రెస్ అభ్యర్థి హర్షవర్ధన్ చేతిలో ఓడిపోయాడు.

jupalli krishna rao telugu rajyam

 ఆ తర్వాత హర్షవర్ధన్ తెరాస లో చేరటం చేరటం జరిగింది, ఈ పరిణామం జూపల్లి సుతారం ఇష్టం లేదు. దీనితో ఇద్దరి మధ్య విభేదాలు పెరిగాయి, కలిసి పనిచేసుకోండని పార్టీ పెద్దలు నచ్చచెప్పిన కానీ జూపల్లి వినిపించుకోలేదు, పార్టీ ఆదేశాలను పాటించకుండా పంచాయితీ, మున్సిపోల్ ఎన్నికల్లో వర్గ పోరుకు కారణమైయ్యాడు. కాంగ్రెస్ నాయకుడైన జూపల్లి 2014 లో తెరాస లో చేరి గెలిచి మంత్రి అయ్యాడు, దీనితో కొల్లాపూర్ లో తనకు ఎదురే లేదన్నట్లు వ్యవహరించటంతో 2018 ఎన్నికల్లో ఓడిపోయాడు.

 అయితే అధికారం తెరాస పార్టీదే కాబట్టి పెత్తనం చేయాలనీ చూశాడు , అక్కడ గెలిచిన హర్షవర్ధన్ కూడా తెరాస లో రావటంతో జూపల్లి కి ఇబ్బంది కలిగింది. దీనితో నియోజకవర్గంలో హర్షవర్ధన్ వర్గాన్ని జూపల్లి ఇబ్బందులు పెట్టాలని చూడటం, అధికారిక కార్యక్రమాల్లో సైతం ఎమ్మెల్యేను పక్కన పెట్టి అన్నిట్లో తానే పైచెయ్యి సాధించాలని చూస్తున్నాడు, దీనితో హర్షవర్ధన్ ఈ సమస్యను తెరాస పెద్దల వద్దకు తీసుకోని వెళ్లిన ప్రయోజనం లేకుండా పోయింది. పైగా వాళ్ళని లెక్కచేసే స్థితిలో జూపల్లి లేడు.

 దీనితో తెరాస నాయకత్వం దాదాపుగా జూపల్లిని పట్టించుకోవటం మానేసింది, ఎప్పుడైతే పార్టీ ఆదేశాలు లెక్కచేయలేదో , అప్పటినుండి జూపల్లి ని అనధికారికంగా పార్టీ నుండి పంపినట్లే అంటూ తెరాస నేతలు చెపుతున్నారు, కానీ జూపల్లి మాత్రం కొల్లాపూర్ లో నాదే హవా అన్నట్లు వ్యవహరిస్తున్నారు. పాపం కాంగ్రెస్ నుండి వచ్చిన హర్షవర్ధన్ ఇప్పుడు అధికార తెరాస లో వర్గపోరు తట్టుకోలేక, ఎమ్మెల్యేగా తన బాధ్యతలు నిర్వర్తించలేక ఇబ్బంది పడుతున్నాడు, జూపల్లి విషయంలో తెరాస నాయకత్వం ఎదో ఒక విషయం తేల్చకపోతే రేపొద్దున జూపల్లి వ్యవహారం కేసీఆర్ కు తలనొప్పి గా మారటం ఖాయమని అంటున్నారు స్థానిక తెరాస నేతలు