ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల్లో వైసీపీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సృష్టించిన రికార్డ్స్ ను తెలుగు ప్రజలు ఎప్పటికి మర్చిపోలేరు. వైసీపీ వల్ల ఏపీలో టీపీడీ ఇప్పటికే భూస్థాపితం అయింది. అయితే ఇప్పుడు షర్మిల తెలంగాణ రాజకీయాల్లో వచ్చి పార్టీ పెడతానని చెప్పడంతో తెలంగాణ రాజకీయాలు పూర్తిగా మారనున్నాయని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. షర్మిల రాక వల్ల తెలంగాణలో కేసీఆర్ కు పోటీగా ఉన్న పార్టీలకు ఇబ్బంది కలగనుందని రాజాకీయ వర్గాలు చెప్తున్నాయి.
సెంటిమెంట్ వర్క్ ఔట్ కానుందా !!
వైఎస్ షర్మిల నూతన పార్టీ పెట్టడానికి కారణం వైఎస్ రాజశేఖర్ రెడ్డి. ఆయనకు తెలంగాణలో ఇప్పటికి అభిమానులు ఉన్నారు. ఉమ్మడి ఏపీలో రాజశేఖర్ రెడ్డి పాలనా విధానానికి, ఆయన తెచ్చిన పథకాలకు బ్రహ్మ రథం పెట్టేవారు ఇంకా ఉన్నారు. వాళ్ళందరూ ఇప్పుడు వైఎస్ షర్మిల వెంట నడవనున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా తెలంగాణలో పాద యాత్ర చెయ్యలేదు, కానీ షర్మిల చేశారు. ఈ సెంటిమెంట్ కూడా ఇప్పుడు షర్మిలకు కలిసి రానుంది. అలాగే బీజేపీకి హైదరాబాద్ లో, దాని చుట్టూ పక్కల తప్పా మిగిలిన ప్రాంతాల్లో బీజేపీకి ప్రజల్లో ఆదరణ లేదు. కాంగ్రెస్ ఆదరణ ఉన్నా కూడా సరైన లీడర్ లేదు.
ఏ పార్టీకి ఇబ్బందులు రానున్నాయి??
షర్మిల రాక వల్ల తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ కు ఇబ్బందులు రానున్నాయి. ఎందుకంటే బీజేపీకి ఎలాగో హైదరాబాద్ లో తప్ప మిగిలిన ప్రాంతాల్లో ఆదరణ లేదు కాబట్టి దానికి వచ్చిన నష్టం లేదు. కానీ కాంగ్రెస్ కు రాష్ట్రం మొత్తం ప్రజల నుండి ఆదరణ ఉంది.కానీ దానికి సరైన నాయకుడు లేకపోవడం వల్ల రాష్ట్రంలో పార్టీ పతనావస్థకు చేరువలో ఉంది. ఇప్పుడు షర్మిల రావడం వల్ల కాంగ్రెస్ కు ఇబ్బందులు కలగనున్నాయి. ఇప్పుడు వైఎస్ రాజశేఖర్ రెడ్డికి రాష్ట్రం మొత్తం అభిమానులు ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ ఇప్పుడు షర్మిల వెంట నడవనున్నారు.