బొత్స సత్యాన్నారాయణ ఈ పేరు గురించి ఆంధ్ర్రదేశ్ రాజకీయాల్లో పెద్దగా పరిచయం చేయనవసరం లేదు. ఉమ్మడి రాష్ట్రంలో ఒక వెలుగు వెలిగిన ఈ నేత ఒకానొక దశలో ముఖ్యమంత్రి పీఠానికి రెండడుగులు దూరంలో ఆగిపోయారు. రాష్ట్ర విభజన తరువాత పరిణామాలతో కొన్ని రోజులు సైలెంట్ గా ఉన్న బొత్స ఇక చేసేదేం లేక సొంత పార్టీ కాంగ్రెస్ ను వీడి జగన్ నాయకత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెంత చేరారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తన అనుభవంతో జగన్ కు కొన్ని కీలక సమయాల్లో సలహాలు ఇచ్చేవారు.
అయితే 2019 ఎన్నికల్లో పార్టీ భారీ మెజార్టీతో గెలుపొందడంతో సీనియర్ కోటాలో మంత్రి పదవి దక్కించుకున్నారు. ఇక్కడదాక బాగానే ఉన్న ఇప్పుడే ఆయనకు కొన్ని నచ్చడం లేదనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో తన మార్క్ రాజకీయం చూపించిన ఆయన ఇప్పుడు ఆధికారంలో ఉన్న దాంతోపాటు మంత్రిగా ఉన్నప్పటికి తాను అనుకున్న పనులు, చెప్పిన పనులు చేయించుకోలేకపోతున్నారనే వాధనలు వినిపిస్తోన్నాయి. ఆఖరికి తన సొంత జిల్లాలోనే తన మాట చెల్లించుకోలేకపోతున్నట్లు కేడర్ సమాచారం. దీంతో ఇంత జరుగుతున్న ముఖ్యమంత్రి సైలెంటుగా ఉండడంపై ఆయన కాస్త అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది.
ఎంపీగా, మంత్రిగా, పీసీసీ అధ్యక్షడుగా పనిచేసిన అనుభవం ఉన్న ఆయన మాట ఇప్పుడు చెల్లకపోవడం ఇటు పార్టీలో అటు ప్రభుత్వంలో హాట్ టాఫిక్ గా మారింది. బొత్స ఏ పార్టీలో ఉన్నా తనకు పదవులు వరించడమే కాకుండా తనను నమ్మకున్న వారికి కూడా పదవులు వరించేలా చేయడంలో ఆయన సిద్దహస్తుడు అయితే ఇప్పుడు సీన్ రివర్స్ అయిందంటున్నారు. మొన్న జరిగిన కార్పొరేషన్ ఎన్నికల్లో తన మనుషులకు టికెట్లు దక్కించుకోవడంలో బొత్స మాట చెల్లుబాటు కాలేదని స్థానిక నేతలు చెవులు కొరుకుంటున్నారు. ఇప్పుడు ఈ టికెట్ల కేటాయింపు విషయంలో తన ప్రత్యార్ధి కొలగట్ల మాట నెగ్గడంతో బొత్స చాలా అసంతృప్తిగా ఉన్నట్లు తెలుస్తోంది. తన సొంత జిల్లాలోనే తన మాట చెల్లకపోయే పరిస్థితులు ఉన్న ముఖ్యమంత్రి మౌనం కూడా ఆయనకు నచ్చడం లేదనే టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వ్యవహారంలో ముఖ్యమంత్రి ఎవరికి సపోర్ట్ చేస్తారో లేదో చూడాలని పార్టీ శ్రేణులు అంటున్నాయి.