పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలు హర్ట్ అయ్యేలా కామెంట్లు చేస్తుండగా వైసీపీ నేతలు సైతం రివర్స్ లో అదే స్థాయిలో కౌంటర్లు ఇస్తున్నారు. పీకే అంటే పిచ్చికుక్క అని పవన్ కళ్యాణ్ అభిమానులకు షాకిచ్చేలా కామెంట్లు వినిపిస్తున్నాయి. నువ్వు కళ్యాణాల పవన్ వి అంటూ పవన్ పై కొంతమంది తీవ్రస్థాయిలో విమర్శలు చేస్తున్నారు. బాబు గారి జోకర్ అంటూ పవన్ పై అంబటి చేసిన కామెంట్లు హాట్ టాపిక్ అవుతున్నాయి.
జనసేన సింగిల్ గా పోటీ చేస్తే ఆ పార్టీ జగన్ కు గట్టి పోటీ ఇవ్వడం ఎప్పటికీ చేత కాదు. ఈ రీజన్ వల్లే పవన్ కళ్యాణ్ ఇతర పార్టీలపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ప్రజల కోసం ఏవో చిన్నచిన్న కార్యక్రమాలు చేసి తానేదో గొప్ప పనులు చేస్తున్నట్టు ప్రచారం చేసుకుంటూ ఉండటం గమనార్హం. అనవసర వివాదాల వల్ల పవన్ కళ్యాణ్ కు లాభం కంటే నష్టం ఎక్కువగా జరుగుతోందని కామెంట్లు వినిపిస్తున్నాయి.
తాను ప్యాకేజీ తీసుకోవడం లేదని చెప్పే పవన్ కళ్యాణ్ టీడీపీకే తాను ఎందుకు మద్దతు ఇవ్వాలని అనుకుంటున్నారో చెబితే బాగుండేది. ప్రజల మద్దతు తనకు ఉందని పవన్ కళ్యాణ్ ఎలా నమ్ముతున్నారో ఎవరికీ అర్థం కావడం లేదు. పవన్ కళ్యణ్ సొంతంగా ఇప్పటివరకు గెలవలేదు. భవిష్యత్తు ఎన్నికల్లో గెలుస్తారనే నమ్మకం కూడా పవన్ కళ్యాణ్ కు అయితే లేదనే సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో సంచలనాలు సృష్టిస్తానని నమ్ముతున్నారు. అయితే వాస్తవాలు మాత్రం ఆ దిశగా ఉండటం లేదు. జనసేనకు ఏపీలోని పలు ప్రాంతాల్లో నోటా కంటే తక్కువగా ఓట్లు వచ్చాయి. ఈ విషయాలను కూడా గుర్తుంచుకుని పవన్ కళ్యాణ్ అడుగులు వేస్తే బాగుంటుందని చెప్పవచ్చు.