తెలుగు రాష్ర్టాల్లోకి కరోనా వచ్చిన కొత్తలో మహమ్మారిపై అతిపెద్ద కామెడీ చేసింది ఇక్కడ రెండు రాష్ర్టాల సీఎంలు ఇద్దరే అన్నది అందరికీ తెలిసిందే. జస్ట్ పారాసిట్మాల్ గోళీ ఒకటేసుకుంటే తగ్గిపోతుందని ఒకరంటే.. బ్లీచింగ్ పౌడర జల్లితే చచ్చిపోతుంది అంతగా హైరానా పడాల్సిన పనిలేదు సునాయాసంగా కొట్టిపారేసారు. ఆ పై కరోనా కోరలు చాచి విరుచుకు పడుతుంటే అర్ధమైంది మహమ్మారి సోకితే ఎలా? ఉంటుంది అన్నది. వెంటనే అత్యవసర సమావేశాలు ఏర్పాటు చేయడం..ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించ డం ప్రజల ప్రాణాల కన్నా ఏదీ ముఖ్యం కాదని వాస్తవంలోకి రావడం జరిగింది.
ఆ తర్వాత కూడా ఒకరు తానా అంటే ఇంకొకరు తందానా అన్నారు. కరోనాతో సహజీవనం చేయాలని ఒక రాష్ర్ట సీఎం అంటే! అవును అవును అంటూ మరో సీఎం మద్దతు పలకడం జరిగింది. దీంతో ఇద్దరు సీఎంలు ఇక్కడే అడ్డంగా దొరికిపోయారు. ఓ పక్క ప్రపంచ ఆరోగ్యం సంస్థ, కేంద్రం సీరియస్ గా హెచ్చరికలు జారీ చేస్తుంటే సీఎంలు మాత్రం వాటిని పెద్దగా పట్టించుకోలేదు. తర్వాత వాస్తవం ఏంటన్నది? గ్రహించినప్పటికీ ఆ ఇద్దరు సీఎంలపై నెగివిటీ అనేది జనాల్లోకి బలంగా వెళ్లిపోయింది. ఎదురయ్యే పరిణామాన్ని, పరిస్థితుల్ని ముందే ఊహించే జగన్ మోహన్ రెడ్డి అలా కామెంట్ చేసారన్నది వాస్తవం.
ఎందుకంటే మూడు నెలల క్రితం వరకూ కరోన పరీక్షలు చేయడం..క్వారంటైన్ సెంటర్ల ఏర్పాటు..కొవిడ్ ట్రీట్ మెంట్ విషయంలో మిగతా రాష్ర్టాలకన్నా ఏపీలో భారీగానే జరిగాయి. అయితే సమూహ వ్యాప్తి దశకు చేరుకున్నది అన్న అనుమానం మొదలైన దగ్గర నుంచి కేసులు ఎక్కువ సంఖ్య అవ్వడంతో ప్రభుత్వంపై వ్యతిరేకత బాగా పెరిగింది. ప్రస్తుతం కొవిడ్ కు సంబంధించి పరీక్షలు చేయడంలో..సరైన చికిత్స అందించడంలో..ప్రయివేటు ఆసుపత్రుల దోపిడి వంటి సన్నివేశాలు చూస్తుంటే జగన్ సర్కార్ కూడా విఫలమైనట్లే కనిపిస్తోంది. ఈ విషయంలో జగన్ మాటలు కోటలు దాటుతున్నాయి తప్ప వాస్తవం ఏంటన్నది బాధితులకే తెలుస్తోంది.
ప్రభుత్వ పీహెచ్ సీల వద్ద పరిస్థితి ఏంటి? అక్కడ సిబ్బంది ఎలా వ్యవరిస్తున్నారు? బాధిత రోగుల పట్ల వ్యవరించే విధానం? అంతా గాడి తప్పినట్లే కనిపిస్తోంది. అందుకు చిత్తూరు జిల్లాలో నిన్న జరిగిన ఘటనే మరో ఉదాహరణ. ఆక్సిజన్ లేదని ఓ బాధితుడ్ని ప్రయివేటు, ప్రభుత్వ ఆసుపత్రులు తిప్పి పంపేసాయి. దీంతో ఆ బాధితులు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చింది. ఇలాంటి ఘటనలు రాష్ర్టంలో చాలానే ఉన్నాయి. ఇవన్నీ జగన్ ప్రభుత్వం పై వ్యతిరేకత తీసుకొచ్చేవే. జగన్ ఏడాది పాలనపై కరోనా అనేది ఒక మచ్చ వేసినట్లే. కానీ ప్రజలు ఇక్కడ మరో వాస్తవం కూడా మర్చిపోలేదు. 5 కోట్ల జనాభా ఉన్న ఏపీలో…ఆపై అప్పుల్లో ఉన్న ఏపీ లో జగన్ మోహన్ రెడ్డి ఈ మాత్రం అయినా ప్రాణాలకు విలువనిచ్చి పనిచేస్తున్న సీఎంగా గుర్తింపబడుతున్నారు.