Health Tips: మనిషి అందంగా కనిపించటంలో జుట్టు ప్రముఖ పాత్ర పోషిస్తుంది. జుట్టు బాగా పెరగాలి, రాలిపోకూడదు అని ఎవరికి ఉండదు. మనిషి భాహ్య సౌందర్యాన్ని రెట్టింపు చేయగల శక్తి జుట్టుకి ఉంటుంది. అయితే శరీరంలోనీ కొన్ని రకాల విటమిన్లు లోపం జుట్టు రాలిపోయే సమస్య మొదలవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మనం తినే ఆహారపు అలవాట్ల మీద జుట్టు ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. ఆహారపు అలవాట్లను మార్చుకుని, కొన్ని రకాల ఆహార పదార్థాలను మీ డైట్ లో చేసుకున్నట్లయితే మీ జుట్టు ఇట్టే పెరగడమే కాకుండా ఆరోగ్యవంతంగా ఉంటుంది.
జుట్టు ఆరోగ్యానికి ఏ విటమిన్లు దోహదపడుతాయి అని ఇప్పుడు తెలుసుకుందాం.
ఐరన్: శరీరంలో ఐరన్ లోపిస్తే ఆరోగ్య సమస్యలతో పాటుగా జుట్టు రాలే సమస్య మొదలవుతుంది. గుడ్లు, తోటకూర, మాంసం లో ఐరన్ ఎక్కువగా లభిస్తుంది. కనుక మీరు తీసుకునే ఆహారం లో ఐరన్ ఎక్కువ ఉండేలా జాగ్రత్త వహించాలి.
విటమిన్ ఏ: శరీరంలో విటమిన్ ఏ లోపిస్తే జుట్టు విపరీతంగా రాలిపోతుంది. అంతేకాకుండా శరీరంలో అనేక అనారోగ్య సమస్యలకు గురి కావలసి వస్తుంది. శరీరంలో విటమిన్ ఏ పుష్కలంగా ఉంటే గనుక జుట్టు పెరుగుదల బాగుంటుంది. విటమిన్ ఏ స్కిన్ గ్లాండ్స్ సెబమ్ ను ఉత్పత్తి చేస్తుంది, ఇది జుట్టు కు మాయిశ్చరైజర్ గా పనిచేస్తుంది. క్యారెట్, పాలకూర, చిలగడదుంప, గుమ్మడి కాయ, గుడ్లు, పాలు, పెరుగు, కాలిఫ్లవర్ లలో విటమిన్ ఏ లభిస్తుంది.
విటమిన్ బి: విటమిన్ బి ని బయోటిన్ అని కూడా పిలుస్తారు. శరీరంలో బయోటిన్ లోపిస్తే జుట్టు సమస్యలతో పాటుగా ఇతర ఆరోగ్య సమస్యల బారిన పడే అవకాశం ఉంది. బయోటిన్ లోపం కలగకుండా ఉండటానికి మాంసం, బాదం పప్పు, ఆకుకూరలు, చేపలను తినాలి.
విటమిన్ సి: విటమిన్ సి లో యాంటీబయాటిక్స్ ఎక్కువగా ఉంటాయి. విటమిన్ సి లోపం వలన ఆక్సిడేటివ్ స్ట్రెస్ పెరిగి జుట్టు పెరుగుదల ఆగిపోతుంది. ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ను తగ్గించడానికి స్ట్రాబెరీ, సిట్రస్ ఫ్రూట్స్, మిరియాలు, జామకాయల లో విటమిన్ సి ఉంటుంది.