టెక్నాలజీ పెరిగిపోవడం వల్ల ఎక్కడ ఎవరు ఏమి మాట్లాడుతున్నారో ఇట్టే తెలుసుకోవచ్చు. చాలా రకాల మోసాలను టెక్నాలజీని ఉపయోగించి అధికారులు కనిపెడుతున్నారు, మోసం చేసిన వారిని అధికారులు పట్టుకుంటున్నారు. అయితే ఇప్పుడు బీజేపీ ఆఫీస్ లో టీడీపీ నాయకులు తమ వేగులను ఉంచారని, సీసీ కెమెరాల పాస్వర్డ్స్ ను తెలుసుకున్నారని, అందుకే అక్కడ జరిగిన విషయాలన్నీ టీడీపీ నేతలకు తెలుస్తున్నాయని వైసీపీ నేతలు చెప్తున్నారు.
టీడీపీ వేగులు అమిత్ షా ఆఫీస్ లో ఉన్నారా!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, హోమ్ మంత్రి అమిత్ షా ఢిల్లీలో సమావేశం అయ్యారు. వాళ్లిద్దరూ కలిసి ఏమి మాట్లాడుకున్నారో ఎవరి తెలియదు. అయితే యెల్లో మీడియా మాత్రం వాళ్లిద్దరూ కలిసి ఏమి మాట్లాడుకున్నారో తెలుసా అంటూ కథనాలు ప్రచారం చేస్తున్నారు. ఈ సమావేశంలో జగన్ ను అమిత్ షా తిట్టారని, అనేక హెచ్చరికలు చేశారని కథనాలు ప్రచారం చేస్తున్నారు. అలాగే రాజమండ్రిలో ఉన్న టీడీపీ నేత బుచ్చయ్య చౌదరికు వాళ్ళ మధ్య జరిగిన సంభాషణలు తమకు తెలుసని వ్యాఖ్యానించి,అందరిని ఆశ్చర్యానికి గురి చేశారు. ఇప్పుడు వ్యాఖ్యలు రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టిస్తున్నాయి. ఒక పార్టీ నాయకుడు ఇలా వ్యాఖ్యానించడం వల్ల నిజంగానే అమిత్ షా ఆఫీస్ లో టీడీపీ వేగులు ఉన్నారని వైసీపీ నేతలు అంటున్నారు.
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, అమిత్ షా మధ్య జరిగిన సంభాషణలను బీజేపీ నాయకులే లీక్ చేసి ఉంటారని, వల్లే వైసీపీ ప్రజల్లో వ్యతిరేకత రావడానికి ఇలా పతాకం రచించి ఉంటారని కూడా రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో బీజేపీ జెండాను నిలపడానికి కేంద్ర బీజేపీ నాయకులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే అమిత్ షా జగన్ మధ్య జరిగిన చర్చను కూడా టీడీపీకి చెప్తూ వైసీపీని బలహీనపరచడానికి ప్రయత్నం చేసే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు.