India : ఉక్రెయిన్ వేడిలో పాకిస్తాన్ భారత్‌పై అణ్వాయుధం ప్రయోగించాలనుకుందా?

India : ఉక్రెయిన్ మీద రష్యా దండయాత్ర కొనసాగుతున్న దరిమిలా, ప్రపంచ దేశాల్లో గుబులు కనిపిస్తోంది. చమురు ధరలు పెరగడం వల్ల అన్ని దేశాలూ ఇబ్బందుల్ని ఎదుర్కొంటున్నాయి. అయితే, యుద్ధం నుంచి వెనక్కి తగ్గేందుకు రష్యా సుముఖత వ్యక్తం చేయడంలేదు.. లొంగిపోవడానికి ఉక్రెయిన్ కూడా ఒప్పుకోవడంలేదు. ఇది ఉక్రెయిన్ – రష్యా రగడ.

అక్కడ పరిస్థితులు అలా వుంటే, భారతదేశం నుంచి ఓ క్షిపణి ప్రమాదవశాత్తూ పొరుగు దేశం పాకిస్తాన్‌లోకి దూసుకెళ్ళింది. నిర్వహణ పనుల నిమిత్తం క్షిపణిని తనిఖీ చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు భారతదేశం పేర్కొంది. ఈ మేరకు పాకిస్తాన్‌కి పూర్తి సమాచారం కూడా ఇచ్చి, క్షమాపణలు కూడా చెప్పింది.

అయితే, పాకిస్తాన్ మాత్రం ఇదే అదనుగా చూసుకుని భారతదేశంపై అత్యంత శక్తివంతమైన మిస్సైల్‌ని సంధించాలనుకుందంటూ కథనాలొస్తున్నాయి. ప్రపంచ మీడియా ఈ అంశాన్ని ప్రస్తావిస్తోంది. పాకిస్తాన్, భారతదేశంపై పగ తీర్చుకోవాలనుకుంది.. మిస్సైల్‌ని సిద్ధం కూడా చేసింది. అయితే, అదెలాంటి మిస్సైల్ అన్న వివరాలు తెలియరాలేదన్నది ప్రపంచ మీడియాలో కనిపిస్తోన్న కథనాల సారాంశం.

నిజానికి, భారతదేశం ముందు సైనిక పాటవం పరంగా చూసుకుంటే పాకిస్తాన్‌కి పోటీ పడేంత సీన్ లేదు. కానీ, చాలా ఏళ్ళుగా భారతదేశంతో సరిహద్దులో కుట్రపూరిత యుద్ధం పాకిస్తాన్ చేస్తూనే వుంది.. తీవ్రవాదుల్ని మన దేశంలోకి ఎగదోయడం ద్వారా.

మిస్సైళ్ళను సంధించడం దాకా పరిస్థితి వెళితే, పాకిస్తాన్ కంటే ముందే భారతదేశం అప్రమత్తమైపోయి.. పాకిస్తాన్‌ని నాశనం చేసెయ్యగలదు.