Health Tips: చిన్న పిల్లలు ఇన్ హెలర్స్ వాడటం మంచిదేనా! ఇన్ హెలర్ వాడటం వల్ల ఏం జరుగుతుంది?

Health Tips: ప్రస్తుత కాలంలో మారిన ఆహారపు అలవాట్లు, వాతావరణ మార్పులు కారణంగా అనేకమంది ఉబ్బసం (ఆస్తమా) భారిన పడుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా 18 శాతం మంది ఈ వ్యాధి బారిన పడినట్లు అంచనా వేస్తున్నారు. అయితే దీని నుంచి ఉపశమనం పొందడానికి డాక్టర్లు ఇన్ హెలర్స్ ఎక్కువగా ఉపయోగించమని సలహా ఇస్తుంటారు. పెద్దవాళ్ళు, చిన్నవాళ్ళ ఎవరికైనా సరే ఎక్కువగా ఇన్ హెలర్స్ వాడటం మంచిదని డాక్టర్లు సలహా ఇస్తారు. అయితే ఇన్ హేలర్ విషయంలో చాలామందికి అనేక అనుమానాలు ఉంటాయి. వీటిని వాడవచ్చా లేదా.. వీటిని వాడటం వల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా అనే అనుమానాలు ఉంటాయి.

ఈ రోజుల్లో పుట్టిన పిల్లలు కూడా ఈ వ్యాది బారిన పడుతున్నారు.అయితే చిన్నపిల్లలు ఈ ఆస్తమా వ్యాధితో బాధపడుతున్న సమయంలో పిల్లలకు ఇన్ హెలర్ ఎక్కువగా వాడటం మంచిదేనా అని సందేహాలు ఉన్నాయి. వీరికి కూడా ఇన్ హెలేర్ వాడటమే ఉత్తమమైన వైధ్యంగా చెబుతున్నారు. ఇన్ హెలేర్ వాడటం వల్ల అది డైరెక్ట్ గా వెళ్లి ఊపిరితిత్తుల మీద ప్రభావం చూపుతుందని, దీనివల్ల ఏమైనా సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని అనేక మందిలో అపోహ ఉంది. అయితే ఇతర సిరప్లు, టాబ్లెట్లు వాడితే అవి శరీరంలో సమస్య ఉన్న చోట మాత్రమే కాకుండా ఇతర శరీర భాగాల మీద కూడా ప్రభావం చూపుతాయి. కానీ ఇన్హేలర్స్ కరెక్ట్ గా ఊపిరితిత్తులలోకి వెళ్లి సమస్యను తగ్గిస్తాయి.

ఇన్ హేలర్ లోని మందు కేవలం మైక్రో గ్రాములలో మాత్రమే ఉంటుంది. ఇది టాబ్లెట్లు, సిరప్ లతో పోలిస్తే చాలా తక్కువ. పిల్లలు ఆస్తమాతో బాధపడుతుంటే, వారు పెద్ద అయితే తగ్గుతుందిలే అనే నిర్లక్ష్యం చేయకండి, ఇది వారి ఎదుగుదల మీద ప్రభావం చూపుతుంది. పిల్లలు పెద్ద అయితే ఊపిరితిత్తుల పరిమాణం పెరిగి కొద్ది సమస్య కొంచెం తక్కువ అవుతుందనే అపోహలకు తావివ్వకుండా పిల్లలైనా, పెద్దలైనా ఆస్తమా సమస్యతో ఇబ్బంది పడుతుంటే ఇన్ హేలర్స్ ఉపయోగించవచ్చని వైద్యులు సూచిస్తున్నారు.