Corona Virus: బ్రతుకులని అల్లకల్లోలం చేస్తున్న మహమ్మారి కరోనా వైరస్ ప్రజల్లో ఆందోళన రేకెత్తిస్తుంది. ఎప్పుడు ఎలాంటి దిక్కుమాలిన వార్త వినాల్సివస్తుందని తీవ్ర భయబ్రాంతులకు గుర్వతున్నారు. ఒకవైపు కరోనా నుంచి కోలుకున్నప్పటికీ రకరకాల జబ్బులు తలెత్తి ప్రజలు తమ ప్రాణాలని కోల్పోతున్నారు. మరి ముఖ్యంగా ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్, బ్లాక్ ఫంగస్ ఇన్ఫెక్షన్లకు గురవుతున్నారు. అయితే కరోనా వైరస్ బారినపడకుండా ఉండేందుకు కొన్ని నాటువైద్యాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. మరి ఇది ఎంతవరకు కరెక్టో తెలుసుకుందాం
కోవిడ్ సహా ఏ ఇతర ఇన్ఫెక్షన్ల నుంచి అయిన గాడిదపాలు రక్షిస్తాయని మహారాష్ట్రలో హింగోలి ప్రాంతంలో కొందరు ప్రచారం చేస్తున్నారు. దీనితో ప్రజలు స్పూను రూ. 100, లీటరు పాలు అయితే రూ. 10,000 వెచ్చించి మరీ కొంటున్నారు. తమతో పాటు పిల్లలకి కూడా ఈ గాడిద పాలు పట్టిస్తున్నారు. అయితే ఈ గాడిదపాలతో కోవిడ్ ఇన్ఫెక్షన్లు తగ్గుతుందనేది అవాస్తవమని వైద్యులు చెబుతున్నారు. ఇలాంటి ప్రచారాలు గుడ్డిగా నమ్మి మోసపోవద్దని వైద్యులు సూచిస్తున్నారు.