గాడిద పాల రేటు ఎక్కువగా ఉండటానికి కారణాలివే.. ఈ పాల వల్ల ఆ సమస్యలు దూరమా?

మనలో చాలామంది గాడిద పాల గురించి ఏదో ఒక సందర్భంలో వినే ఉంటారు. గాడిద పాలు తాగడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. గాడిద పాలలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. చర్మానికి ఈ పాలు ఎంతో మేలు చేస్తాయి. కొవ్వు తక్కువగా ఉండే ఈ పాలను తీసుకోవడం ద్వారా ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

తల్లి పాలకు సమానమైన పోషకాలు గాడిద పాలలో ఉండటం వల్ల శరీరానికి ఎంతో మేలు చేకూరుతుంది. శరీరానికి అవసరమైన టౌరిన్ ఈ పాలలో ఉండటం వల్ల ఈ పాలు శిశువులకు, వృద్ధులకు ఫంక్షనల్ ఫుడ్ గా పని చేస్తాయని చెప్పవచ్చు. గాడిద పాలు తీసుకోవడం ద్వారా ఇన్ఫెక్షన్ల బారిన పడే అవకాశాలు అయితే తగ్గుతాయి. యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉన్న ఈ పాలు వ్యాధికారక బ్యాక్టీరియాకు వ్యతిరేకంగా పని చేస్తాయని చెప్పవచ్చు.

పొట్టలో మంటను తగ్గించడంతో పాటు వాపును తగ్గించడంలో ఈ పాలు ఉపయోగపడతాయని చెప్పవచ్చు. చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఈ పాలు సహాయపడతాయి. ఈ పాలు తీసుకోవడం వల్ల చర్మానికి నిగారింపు లభించే అవకాశాలు అయితే ఉంటాయి. గాడిద పాలు తీసుకోవడం ద్వారా ఎముకలకు అవసరమైన బలం లభిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ ను ఈ పాలు సులువుగా పెంచుతాయని చెప్పవచ్చు.

ఈ పాలలో పాలీ అన్ శాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్ లు ఉంటాయి. వీటిలో ఉండే లియోలెనిక్ యాసిడ్ రక్తనాళాల పనితీరును మెరుగుపరిచే విషయంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. జీర్ణక్రియను ప్రోత్సహించే విషయంలో ఈ పాలు ఎంతగానో ఉపయోగపడతాయని చెప్పవచ్చు. టైప్2 డయాబెటిస్ తో బాధ పడేవాళ్లు ఈ పాలు తాగడం వల్ల ఆ సమస్య సులువుగా దూరమవుతుంది.