కరోనా వ్యాక్సిన్ కొత్త వేరియంట్ పై పని చేస్తుందా.. ప్రముఖ వైద్యులు ఏం చెప్పారంటే?

కరోనా వైరస్ పేరు వింటే ఇప్పటికీ మనలో చాలామంది భయాందోళనకు గురవుతారు. కొన్ని లక్షల మంది ఈ వైరస్ వల్ల ప్రాణాలను కోల్పోయారు. అయితే కరోనా వ్యాక్సిన్ ను తీసుకున్న వాళ్లలో చాలామందికి ఈ వైరస్ సోకలేదు. ఒకవేళ సోకినా ప్రాణాలకు అపాయం కలగలేదు. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న వాళ్లు ఈ వైరస్ నుంచి వేగంగా కోలుకున్నారు. కరోనా వ్యాక్సిన్ కొత్త వేరియంట్ పై పని చేస్తుందా అనే ప్రశ్నకు ఆసక్తికర సమాధానం వినిపిస్తోంది.

జేఎన్1 వేరియంట్ మరీ ప్రమాదకరమైన వేరియంట్ కాదని ఈ వైరస్ బారిన పడిన వాళ్లలో సాధారణ లక్షణాలే కనిపిస్తున్నాయని వైరస్ ను నిరోధించడంలో కరోనా వ్యాక్సిన్ ప్రభావవంతంగా పని చేస్తుందని తెలిపారు. కరోనా సోకినా ఆస్పత్రులలో చేరాల్సిన పరిస్థితి రాకపోతే ఇమ్యూనిటీ పవర్ బాగానే ఉందని అర్థం చేసుకోవాలని వైద్యులు వెల్లడిస్తున్నారు. తీవ్ర అస్వస్థతకు గురైన వాళ్లు వెంటనే ఆస్పత్రులలో చేరితే మంచిది.

కరోనా విషయంలో మరీ నిర్లక్ష్యం పనికిరాదని చెప్పవచ్చు. కరోనా వైరస్ విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. కరోనా వైరస్ సోకకుండా మాస్క్ లను ధరిస్తే మంచిది. కరోనా వైరస్ సోకితే ఇతర అవయవాలపై ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. కరోనా వైరస్ సోకితే ఆరోగ్యానికి తీవ్రస్థాయిలో నష్టం చేకూరే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు.

కరోనా వైరస్ రాబోయే రోజుల్లో మరింత ప్రభావవంతంగా ఎఫెక్ట్ చూపించే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు. కరోనా వైరస్ కేసులు కర్ణాటకలో ఎక్కువగా నమోదవుతున్నాయి. కరోనా వైరస్ సోకకుండా శానిటైజర్లను వాడితే మంచిదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.