Health Tips:ప్రస్తుతకాలంలో ఆహారపు అలవాట్లలో మార్పులు రావటం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. శారీరక శ్రమ లేకపోవటం, రోజుకు సరిపడా నిద్ర లేకపోవటం వల్ల కూడా ఆరోగ్య సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. తరచూ అందరినీ ఎక్కువగా వేధిస్తున్న సమస్యలలో మలబద్దకం సమస్య కూడా ఒకటి. ఈ మలబద్దకం నియంత్రణలో ఉంచటానికి అవిసె గింజలు ఉపయోపడతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. మలబద్దకం సమస్య నియంత్రణలో అవిసె గింజలు ఎలా పని చేస్తాయో తెలుసుకొందాం.
అవిసె గింజలు గురించి చాలామందికి పెద్దగా అవగాహన ఉండదు.ఈ గింజలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఈ రోజుల్లో వివిధ రకాల ఆహార పదార్ధాలు తీసుకోవటం వల్ల ఉదర సంబంధిత వ్యాధులు తలెత్తుతాయి. ఈ క్రమంలో మలబద్దకం అత్యంత సాధారణ సమస్యగా మారింది. ఈ సమస్య చిన్న, పెద్ద అని వయసు వ్యత్యాసం లేకుండా అందరినీ ఇబ్బంది పెడుతోంది.మలబద్ధకం కారణంగా ముఖం మీద మొటిమలు, పైల్స్ సహా అనేక వ్యాధులు సంభవిస్తాయి.
అవిసె గింజల లో ఉండి ఫైబర్ కారణంగా మలబద్ధకం సమస్య నుండి తక్షణ ఉపశమనం లభిస్తుంది.అవిసె గింజలలో ఉండే కొన్ని రకాల మూలకాలు జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. అవిసె గింజలు తినడం వల్ల జీర్ణక్రియమెరుగుపడుతుంది. దీంతో మలబద్ధకం నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. అందుకే ఆహారంలో అవిసె గింజలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. అవిసె గింజల్లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్‌లు అధికంగా ఉంటాయి. ఇవి పేగు మంటని తగ్గించడంలో సహాయపడుతుంది.
అవిసెగింజలు బీపీ, షుగర్ వంటి ఆరోగ్య సమస్యలను కూడా అదుపులో ఉంచుతాయి. అవిసె గింజలు ప్రతి రోజు ఉదయం పూట తీసుకుంటే ‘అలసట’ నుంచి ఉపశమనం పొందవచ్చు. ఇవి శరీరంలోరోగ నిరోధక శక్తిని రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అవిసె గింజల్లో పలురకాల క్యాన్సర్లను తగ్గించే గుణాలున్నాయి. అవిసె గింజలను ఉదయాన్నే తింటే శక్తి లభించి రోజంతా ఉత్సాహంగా ఉంటారు. కీళ్ల నొప్పులు కూడా పోతాయి.