అచ్చెన్న పేరు చెబితే చినబాబు భయపడుతున్నారా ?

lokesh

 నిన్న మొన్నటి వరకు టీడీపీ పార్టీలో చినబాబు మాటకు తిరుగులేదు. ఆయన చెప్పిందే వేదం అన్నట్లు పరిస్థితి ఉండేది, కానీ నేను సొంత పార్టీలోనే చినబాబు కు కష్ట కాలం వచ్చిందని టీడీపీ నేతలే గుసగుసలాడుతున్నారు, పార్టీలో యాక్టివ్ గా ఉన్నవారికి, లేనివారికి, పార్టీ మారుతారని ప్రచారం జరుగుతున్న వారికి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న వారికి, ఇలా అందరికీ పదవులను కట్టబెట్టేశారు.

lokesh babu

 అగ్రవర్ణాల పార్టీ అని పదవులు కూడా బాబు సామాజిక వర్గం వారికి మాత్రమేనని, ఇలా ఎన్నో రకాలుగా టిడిపిపై విమర్శలు వచ్చేవి. అయితే ఆ ముద్ర నుంచి బయటపడేందుకు పార్టీని, బయటపడేసేందుకు, మళ్లీ అధికారం దక్కించుకునేందుకు టిడిపి చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెద్ద జంబో కార్యవర్గాన్ని బాబు ప్రకటించేశారు. అందులో దాదాపు మూడు వంతులు బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ లకు కేటాయించారు.తెలుగుదేశం రథసారధిగా బీసీ సామాజిక వర్గానికి చెందిన అచ్చెన్న కు అప్పజెప్పారు.

 ఇక అంతా అనుకున్నట్టు గానే అచ్చెన్న సారధ్యంలోని టిడిపి గతంతో పోలిస్తే యాక్టివ్ అవడమే, కాకుండా నిరంతరం పోరాటాలు చేసేందుకు సిద్ధమైపోతుంది. ఇదంతా పార్టీకి మంచి పరిణామమే అయినా కానీ చినబాబుకు మాత్రం ఇబ్బందిగా మారిపోనుంది. పోరాటాలు చేస్తున్న అచ్చెన్న చుట్టూ పార్టీ క్యాడర్ చేరిపోతే మరి తన వెనుక నిలబడేది ఎవరు అనే భయం చినబాబుకు పట్టుకుందని, అచ్చెన్న లాంటి నేత స్పీడ్ తట్టుకోవటం ఒక్కోసారి చంద్రబాబుకే కష్టమని, ఇక తనకు సాధ్యంకాదని ఇది ఇలాగే కొనసాగితే మున్ముందు టీడీపీ అంటే అచ్చెన్న నాయుడు పేరే వినిపిస్తోందని, తాను కనీసం సోదిలో కూడా లేకుండా పోయే ప్రమాదం ఉందని చినబాబు బాగా ఫీల్ అవుతున్నట్లు తెలుస్తుంది.

 ఆయనతో తనను పోల్చి చూసి తనను అవమానాలకు గురి చేస్తారనే భయంతో పాటు , సాధారణ ఎమ్మెల్యేగా ఉండగానే అచ్చెన్న దూకుడు ఎలా ఉంటుందో అందరూ చూశారు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడి హోదాలో కూడా ఉండడంతో, తనను మించి పోతారు అని భయం చిన బాబు లో తీవ్రంగా ఉందని తెలుస్తుంది. దీనితో పార్టీలో తనకంటూ మరో వర్గాన్ని తయారు చేసుకునే పనిలో పడ్డాడు చినబాబు. ఇందుకోసం మరో బీసీ నేత అయ్యన్నపాత్రుడి సహకారం తీసుకుంటున్నట్లు తెలుస్తుంది.