పవన్ ప్రతిపాదనకు చంద్రబాబు ‘ఓకే’ చెప్పినట్టేనా.?

Chandrababu Said OK

Chandrababu Said OK : ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోనివ్వను..’ అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన ప్రకటన రాజకీయ వర్గాల్లో పెను ప్రకంపనలకు కారణమైంది. అధికార వైసీపీ, ఈ విషయమై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. అంతే కాదు, చంద్రబాబు దత్త పుత్రుడిగా పవన్ కళ్యాణ్‌ని అభివర్ణిస్తోంది. టీడీపీ – జనసేన కలిసి వైసీపీ మీద కుట్ర పన్నుతున్నాయని వైసీపీ నేతలు ఆరోపించారు.

రాజకీయాల్లో పొత్తులు సర్వసాధారణం. ఎవరు ఎవరితో కలవాలన్నది ఆయా పార్టీల రాజకీయ అవసరాల్ని బట్టి వుంటాయి. 2014 ఎన్నికల్లో టీడీపీకి జనసేన మద్దతిచ్చింది. 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేన విడివిడిగా పోటీ చేశాయి. సో, 2019 ఎన్నికల్లో టీడీపీ, జనసేనకు మద్దతిచ్చే అవకాశాలున్నాయి.

అయినాగానీ, చంద్రబాబు రాజకీయ వ్యూహాల ముందు పవన్ చిత్తవడం ఖాయం. ఇదే విషయమై వైసీపీ, జనసేనను అప్రమత్తం చేస్తోంది కూడా. అయితే, ఘాటైన విమర్శలు జనసేన మీద చేయడం ద్వారా టీడీపీ, జనసేన ఒక్కటయ్యేందుకు వైసీపీ కారణమవుతోంది.

ఇదిలా వుంటే, విపక్షాలన్నీ ఒక్కతాటిపైకి వచ్చేందుకు సిద్ధమైతే, తాను ఆ కూటమికి నాయకత్వం వహిస్తాననే సంకేతాలూ టీడీపీ అధినేత చంద్రబాబు పంపారు. ‘త్యాగాలకు సిద్ధంగా వుండాల్సిందే..’ అంటూ చంద్రబాబు వ్యాఖ్యానించడం ఆసక్తికరమైన అంశమిక్కడ.

2024 ఎన్నికల్లో జనసేన పార్టీ బలాన్ని బహుశా చంద్రబాబు ముందే అంచనా వేశారనుకోవాలా.? లేదంటే, ఇది ఆయన మార్కు రాజకీయం అనుకోవాలా.?