Health Tips: ప్రస్తుత కాలంలో మనం తీసుకునే ఆహారం ఈ విషయంలో చాలా మార్పులు చోటు చేసుకున్నాయి. తద్వారా అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. నూటికి 70 శాతం మంది బిపి షుగర్ వంటి వ్యాధులతో ఇబ్బంది పడుతున్నారు. అలాగే ఈ మధ్యకాలంలో రక్తహీనత సమస్యతో ఇబ్బంది పడే వారి సంఖ్య కూడా క్రమంగా పెరుగుతోంది. రక్తహీనత సమస్యను తేలికగా తీసుకోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. రక్తహీనత సమస్యను అదుపులో ఉంచడానికి ఈ లడ్డు ఒక ఔషధంలా పనిచేస్తుంది.
రక్త హీనత సమస్యతో బాధపడేవారు ఎండు ఖర్జూరం నువ్వుల తో కలిపి చేసిన లడ్డు తినటం వల్ల మంచి ప్రయోజనం లభిస్తుంది. ఈ లడ్డు రుచికి ఎంతో అద్భుతంగా ఉండటమే కాకుండా ఈ లడ్డూ తినటం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఎండు ఖర్జూరాలు ఐరన్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర రక్త కణాలు బాగా వృద్ధి చెందుతాయి.
ఈ లడ్డు తయారుచేయడానికి ముందుగా ఒక కప్పు నువ్వులను దోరగా వేయించుకోవాలి. ఎండు కర్జూరం విత్తనాలను తీసి ఉంచుకోవాలి. ఇప్పుడు వేయించిన నువ్వులు , ఎండు ఖర్జూరం మిక్సీ లో వేసి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి.. తర్వాత ఈ మిశ్రమంలో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి , కొబ్బరి తురుము,బాదం పప్పు, జీడిపప్పు పలుకులు వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని లడ్డూ లాగా ఉంటలుగా చేసుకోవాలి.
ప్రతి రోజు ఒక లడ్డు తినటం వల్ల వీటిలో ఉండే ఐరన్ శరీరంలో రక్త కణాలు వృద్ధి చెందేలాగా చేస్తాయి. అందువల్ల శరీరంలో రక్త శాతం పెరిగి రక్తహీనత సమస్య దూరమవుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారు తప్పనిసరిగా క్రమం తప్పకుండా ప్రతిరోజు ఒక లడ్డు తినడం వల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది.