Allu Arjun: ప్రభాస్ చేయలేని ఆ పనిని అల్లుఅర్జున్ చేస్తూ రిస్క్ చేస్తున్నాడా?

Allu Arjun: టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రష్మిక మందన్న జంటగా నటించిన చిత్రం పుష్ప. ఈ సినిమా గత ఏడాది డిసెంబర్ 17 న విడుదలైన విషయం తెలిసిందే. ఈ సినిమా భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవల్ లో థియేటర్ లలో గ్రాండ్ గా విడుదల అయిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అవడమే కాకుండా బాక్సాఫీసు వద్ద కలెక్షన్ల వర్షం కురిపించింది. 10 కోట్లు కూడా వస్తుందో లేదో అన్న అనుమానంతో ఈ సినిమాను విడుదల చేశారు.. కానీ ఈ సినిమా ఏకంగా 90 కోట్ల రూపాయలను కొల్లగొట్టింది. ఇక ప్రస్తుతం పుష్పా సినిమా టీమ్ ఫుల్ జోష్ లో ఉన్నారు.

ఆ ఉత్సాహంతోనే పుష్ప 2 సినిమాను భారీ స్థాయిలో విడుదల చేస్తామని ఇప్పటికే ప్రకటనలు కూడా చేశారు చిత్రబృందం. అల్లు అర్జున్ కెరీర్ లో బన్నీ స్టార్డంను, స్టామినాను పెంచే సినిమాగా పుష్ప సినిమా నిలబడింది. దీంతో బన్నీ గతంలో నటించిన పలు సినిమాలను హిందీలో డబ్ చేసి థియేటర్ లలో విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన అల వైకుంఠపురములో సినిమాను జనవరి 26న బాలీవుడ్ లో విడుదల చేయబోతున్నారు. అయితే పుష్ప సినిమాలో అల్లు అర్జున్ కి వచ్చిన క్రేజ్ అన్ని సినిమాలలో వస్తుంది అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ప్రస్తుతం అనుకున్న ప్లాన్ వర్కవుట్ కాకపోతే అల్లు అర్జున్ కి వచ్చిన ఆ సూపర్ ఇమేజ్ ను చెడగొట్టిన వారవుతారు.

ఇప్పటికే ఎంతో మంది హీరోలు అలాంటి అనుభవాలు ఎదుర్కొన్నారు. అలాంటి వారిలో సూర్య, విజయ్ ఆంటోని, విజయ్, కార్తీ, విశాల్ లాంటి హీరోలు అలాంటి అనుభవాలను ఎదుర్కొన్నారు. ఇప్పటికే కొంతమంది హీరోలు మార్కెట్ ను పెంచుకునే కోణంలో తప్పటడుగులు వేశారు. ఇక ఇదే విషయంలో హీరో ప్రభాస్ మాత్రం మినహాయింపు. బాహుబలి సినిమా తో వచ్చిన భారీ క్రేజ్ తో ప్రభాస్ తన గత చిత్రాలను డబ్బింగ్ చేయడం జరగలేదు. దీంతో ప్రభాస్ క్రేజ్ కూడా ఇక్కడ డ్యామేజ్ కాలేదు. ప్రభాస్ చేసిన విధంగా అల్లు అర్జున్ చేస్తే పుష్ప సినిమా ద్వారా వచ్చిన క్రేజ్ అల్లు అర్జున్ కు అదే విధంగా ఉంటుంది అని చెప్పవచ్చు. అలా కాదు అని ఈ విషయంలో రిస్క్ చేస్తే ఉన్న క్రేజ్ కాస్త పోతుంది అని చెప్పవచ్చు.