Alcholo: చాలామంది వారికి తెలియకుండానే ఆల్కహాల్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. ఇప్పటి విలాసవంతమైన జీవితంలో ఆల్కహాల్ తీసుకోవడం అన్నది సాంప్రదాయంగా మారిపోయింది. కొంతమంది అయితే ఈ ఆల్కహాల్ ను ప్రాణంగా భావిస్తూ ఉంటారు. ఇంకొంతమంది రిలాక్స్ అవ్వడం కోసం, పార్టీల పేరున ఈ ఆల్కహాల్ ను తీసుకుంటూ ఉంటారు కానీ అది మన ఆరోగ్యానికి మంచిదేనా… ఇది మన శరీరం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో ఇక్కడ తెలుసుకుందాం..
మద్యాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీర పనితీరు తగ్గుతుంది. అలాగే తొందరగా అలసిపోవడం, బలహీనంగా కూడా మారే అవకాశం కూడా ఉంటుందట.మద్యపానం ఆరోగ్యానికి హానికరం అని సినిమాల తెరల మీద చూపిస్తూ ఉంటారు. కానీ అవి మనం చాలా తేలికగా తీసుకుంటాము. అలా తేలికగా తీసుకునే అలవాట్లు మనికి హాని కలిగిస్తాయిట
ఈ మద్యపానం కారణంగా ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నాము. ఈ మద్యపానాన్ని పరిమితికి మించి ఎక్కువగా తీసుకోవడం వల్ల ఊపిరితిత్తుల సమస్యలు, కాలేయం సమస్యలు ఇంకా మూత్ర విసర్జన సమస్యలు, గుండెకు సంబంధించిన సమస్యలు కూడా వచ్చే ప్రమాదం ఉంటుందని వైద్య నిపుణులు తెలుపుతున్నారు.
వైద్య సర్వేల ప్రకారం ఆల్కహాల్ ను తీసుకోని వ్యక్తుల కంటే తీసుకునే వ్యక్తులే ఎక్కువగా ఉన్నారట మద్యం అనేది ఆహ్లాదం కోసం తీసుకున్నాసరే దానిని పరిమితికి మించి ఎక్కువగా తీసుకోవడం వల్ల ప్రాణానికి, ఆరోగ్యానికి మంచి జరగదని చాలా సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలుపుతున్నారు.