వామ్మో.. ఈటీవీ షోల ద్వారా ఈ కమెడియన్ అన్ని లక్షలు సంపాదిస్తున్నారా?

జబర్దస్త్ షో ద్వారా ఊహించని స్థాయిలో పాపులర్ అయిన ప్రముఖ కమెడియన్లలో పంచ్ ప్రసాద్ ఒకరనే సంగతి తెలిసిందే. పంచ్ ప్రసాద్ కామెడీకి ఎంతోమంది అభిమానులు ఉన్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఒక ఆరోగ్య సమస్య ద్వారా పంచ్ ప్రసాద్ వార్తల్లో నిలిచారు. ఆ సమయంలో జబర్దస్త్ కోసం పని చేస్తున్న జడ్జీలు, యాంకర్లు, టీమ్ లీడర్లు ఆదుకోవడంతో పంచ్ ప్రసాద్ ఆ ఆరోగ్య సమస్య నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం జాతిరత్నాలు షోలో, శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో పంచ్ ప్రసాద్ చేస్తున్నారు. ఈ షోలతో పాటు జబర్దస్త్ షోలో కూడా పంచ్ ప్రసాద్ కనిపించి సందడి చేస్తున్నారు. ఈ షోల ద్వారా పంచ్ ప్రసాద్ ఏకంగా నెలకు మూడున్నర లక్షల రూపాయలు సంపాదిస్తున్నారని తెలుస్తోంది. జబర్దస్త్ షోలో చాలామంది కమెడియన్లు తీసుకుంటున్న రెమ్యునరేషన్ తో పోల్చి చూస్తే ఈ మొత్తం చాలా ఎక్కువ మొత్తం అనే సంగతి తెలిసిందే.

పంచ్ ప్రసాద్ కు మల్లెమాల సంస్థ ఆరోగ్యానికి సంబంధించి ఎలాంటి సహాయం చేయకపోయినా ఆయన జీవితాంతం సంతోషంగా ఉండే విధంగా మల్లెమాల షోలలో అవకాశాలను ఇస్తూ అతనికి ఆర్థికంగా ప్రయోజనం చేకూరే విధంగా నిర్ణయాలు తీసుకోవడం గమనార్హం. పంచ్ ప్రసాద్ విషయంలో మల్లెమాల సంస్థ తీసుకున్న నిర్ణయాన్ని నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. ఒక ఇంటర్వ్యూలో ఆది, రామ్ ప్రసాద్ మాట్లాడుతూ ఈ విషయాలను వెల్లడించారు.

ఎంతోమంది కమెడియన్లకు జబర్దస్త్ లైఫ్ ఇచ్చిందని ఈ షో ద్వారా వచ్చిన గుర్తింపు వల్ల చాలామంది కమెడియన్లు ఇతర షోలలో బిజీ అవుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. అయితే ఇతర షోలకు వెళ్లడంలో తప్పు లేకపోయినా అవకాశం ఇచ్చిన షో గురించి షో నిర్మాతల గురించి తప్పుగా కామెంట్లు చేయడం సరికాదని చాలామంది అభిప్రాయపడుతున్నారు. ఈ షో వల్ల చాలామంది ఆర్థికంగా స్థిరపడ్డారు.