ప్రకాశంలో ముదిరిన రాజకీయాలు : రంగంలోకి కొడాలినాని

kodali nani and gjagan

 ప్రకాశం జిల్లా వైసీపీలో వర్గ పోరు తీవ్ర స్థాయిలో ఉంది, పదేళ్ల తర్వాత అధికారం రావటంతో ఒకరి మీద మరొకరు పెత్తనాలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా దర్శి రాజకీయాల్లో విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. అక్కడి ఎమ్మెల్యే మద్దిశెట్టి వేణుగోపాల్ ఏకంగా పార్టీకి, పదవికి రాజీనామా చేసి, వెళ్లిపోవటానికి సిద్దమయ్యాడంటే అర్ధం చేసుకోవచ్చు, దర్శిలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డికి గట్టి పట్టు వుంది. 2019 ఎన్నికల్లో కొన్ని కారణాలు వలన ఆయన పోటీకి దిగలేదు. దీనితో మద్దిశెట్టి వేణుగోపాల్ ను రంగంలోకి దించటంతో, బూచేపల్లి వర్గం మద్దతు ఇచ్చి గెలుపులో కీలకంగా వ్యవహరించారు.

buchepalli vs madddisetti

 2019 ఎన్నికల్లో కొన్ని కారణాలు వలన ఆయన పోటీకి దిగలేదు. దీనితో మద్దిశెట్టి వేణుగోపాల్ ను రంగంలోకి దించటంతో, బూచేపల్లి వర్గం మద్దతు ఇచ్చి గెలుపులో కీలకంగా వ్యవహరించారు. ఇక ఎన్నికల అనంతరం మెల్ల మెల్లగా వర్గపోరు స్టార్ట్ అయ్యింది. అభివృద్ధి కార్యక్రమాలు అన్ని మద్దిశెట్టి తన సామాజిక వర్గానికే ఇస్తున్నారని, ముందు నుండి పార్టీ కోసం పనిచేసిన వాళ్ళను దూరం పెడుతున్నారని కొందరు నేతలు బూచేపల్లి కి చెప్పటంతో, ఆయన తన వర్గానికి పనులు చేపించటం కోసం రంగంలోకి దిగాడు, ఇలా మెల్లగా మొదలైన విభేదాలు నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి.

 ఈ పోటీలో మానసికంగా బూచేపల్లి విజయం సాధిస్తున్నాడు. ఆయనకు జిల్లా మంత్రి, సీనియర్ నేతైనా బాలినేని శ్రీనివాస్ రెడ్డి మద్దతు ఉండటంతో మద్దిశెట్టిపై విజయం సాధిస్తున్నాడు. అయితే మద్దిశెట్టి కూడా తనదైన రాజకీయం చేస్తూ బూచేపల్లికి పోటీఇస్తున్నాడు. ఈ క్రమంలో బూచేపల్లి వర్గం ఇంచార్జి మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని సమక్ష్యంలో మద్దిశెట్టి మీద ఫిర్యాదు చేయటం జరిగింది. ఇక తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన ఉన్నతాధికారులు మరియు జిల్లా మంత్రితో పాటుగా, స్థానిక ఎమ్మెల్యే లు లతో కలిసి ఇంచార్జి మంత్రులు డిఆర్ సి సమావేశంలో నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎమ్మెల్యే మద్దిశెట్టి తన ఇబ్బందులను పార్టీ పెద్దల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తుంది. ఒకదశలో ఉద్వేగానికి లోనైనా ఎమ్మెల్యే కంటనీరు పెట్టుకున్నట్లు తెలుస్తుంది. ఎమ్మెల్యే అయినా నాకే సరిగ్గా పనులు జరగటం లేదు. ఇక ప్రజలకు నేనేమి సేవ చేయాలంటూ బాధపడినట్లు సమాచారం. చివరికి తన కాలేజీ ను కరోనా హాస్పెటల్ కోసం ఇస్తే, దానిని ఇష్టం వచ్చినట్లు వాడేశారు. ఇప్పుడు దానిని బాగు చేయించాలంటే కోట్లు ఖర్చు అవుతుంది. దాని గురించి ఒక్కరు కూడా స్పదించలేదు. పైగా నియోజకవర్గంలో నా మాటకు అసలు విలువ లేకుండా పోతుంది. నేను ఎమ్మెల్యే గా గెలిచి ఏమి లాభం అంటూ మద్దిశెట్టి మాట్లాడినట్లు తెలుస్తుంది. దీనితో దర్శిలో ఇద్దరి నేతల మధ్య రాజీ కుదర్చడానికి మంత్రి కొడాలి నాని బాధ్యత తీసుకున్నట్లు సమాచారం.