భార‌త్‌లో క‌రోనా.. వెన్నులో వ‌ణుకు పుట్టిస్తున్న తాజా లెక్క‌లు..!

ఇండియాలో క‌రోనా కేసులు సంఖ్య 14 ల‌క్ష‌లు క్రాస్ చేసింది. ఇక‌ గ‌త 24 గంట‌ల్లో 49,931 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు న‌మోద‌వ‌గా, క‌రోనా కార‌ణఃగా 708 మంది ప్రాణాలు కోల్పోయారు. కొత్త‌గా న‌మోదైన కేసుల‌తో క‌లిపి దేశ వ్యాప్తంగా క‌రోనా కేసుల సంఖ్య 14,35,453కు చేరుకుంది. ఇక ఇండియా వ్యాప్తంగా క‌రోనా కార‌ణంగా ఇప్ప‌టి వ‌ర‌కు 37,771 మంది మ‌ర‌ణించ‌గా, 9,17,568 మంది కోలుకున్నారు. దీంతో ప్ర‌స్తుతం బార‌త్‌లో 4,85,114 మంది క‌రోనా రోగులు చికిత్స పొందుతున్నారు. ఇక ప్రపంచ వ్యాప్తంగా క‌రోనా పాజిటివ్ కేసులు అత్యధికంగా నమోదవుతున్న దేశాల జాబితాలో ఇండియా 3వ స్థానాని చేరుకుంది. అలాగే కరోనా మరణాల్లో మాత్రం 7వ స్థానంలో ఉంది. దేశంలో క‌రోనా రోగులు రికవ‌రీ రేటు మెరుగ్గానే ఉంద‌ని కేంద్ర వైద్య ఆరోగ్య‌శాఖ తెలిపింది. ‌