ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా తొలి ఇన్నింగ్స్ ముగిసింది. ఓవర్ నైట్ స్కోర్ 96/2 పరుగులతో టీమిండియా మూడో రోజు ఆటను ప్రారంభించి తడబడుతూ చివరికి 244 కి అల్ ఔట్ అయింది. సిడ్నీ టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా 338 పరుగులు చేసి ఆలౌటైన విషయం తెలిసిందే. 96/2 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు ఆట ప్రారంభించిన భారత్ రాణించలేకపోయింది.
రోహిత్ శర్మ 26, శుభ్ మన్ గిల్ 50, పుజారా 50, రహానె 22, హనుమ విహారి 4, పంత్ 36, అశ్విన్ 10, సైనీ 4, బుమ్రా 0 పరుగులు చేశారు. జడేజా 28 నాట్ అవుట్ , సిరాజ్ 6 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. టీమిండియా స్కోరు 100.4 ఓవర్లకు 244 పరుగుల వద్ద అల్ ఔట్ అయ్యింది. గా ఉంది. ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్ లో తొలి ఇన్నింగ్సులో స్టీవ్ స్మిత్ 131, లబుషేన్ 91, పకోష్కీ 62, డేవిడ్ వార్నర్ 6, మాథ్యూ 13, కామెరాన్ గ్రీన్ 0, టిమ్ 1, కమ్మిన్స్ 0, స్టార్క్ 24, లైయన్ 0, జొష్ 1 పరుగులు చేశారు.
అయితే, టీమిండియా ఇన్నింగ్స్ లో మూడు రనౌట్లు ఉన్నాయ్. ఈ రనౌట్లే టీమిండియా ఇన్నింగ్స్ ను కొంపముంచాయ్. అనవసర రన్ కు ప్రయత్నించి వికెట్ల కోల్పోవడం టీమిండియా ఇన్నింగ్స్ ను దెబ్బతీసింది.