శ్రీలంకకు భారీ సాయం అందించిన భారత్‌

శ్రీలంక తీవ్రమైన ధరల సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో ప్రజలు ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. నిత్యవసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ఆ దేశ అధ్యక్షుడు రాజపక్సే లంకలో ఎమర్జెన్సీని ప్రకటించారు. అయితే, తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంకకు భారత్‌ తన వంతుగా సాయం అందించేందుకు ముందుకు వచ్చింది. శ్రీలంకకు 40 వేల టన్నుల ధాన్యాన్ని, డీజిల్‌ను ఇండియా సరఫరా చేయనుంది. భారత్‌ నుంచి బయలుదేరిన ప్రత్యేక ఓడ శనివారం ఉదయం శ్రీలంకకు చేరుకుంది.