చైనాపై ఇక భారత త్రివిద దళాలు తిరగబడటమే ఆలస్యమా? కేంద్రం నుంచి స్పష్టమైన ఆదేశాలు త్రివిద దళాలకు అందేసాయా? ఇక చైనాతో రణమేనా? అంటే అవుననే తెలుస్తోంది. ఇన్నాళ్లు చైనా కయ్యానికి కాలు దువ్వినా ఎంతో ఓపికగా సహనంతో ఎదురుచూస్తు వచ్చింది భారత్. కానీ గాల్వానా ఘర్షణలో 20 మంది భారత సైనుకులు వీరమరణం పొందడంతో భారత్ పగతో రగిలిపోతుంది. చైనా తీసిన దోంగ దెబ్బతో భారత్ మండిపోతుంది. ప్రతీకార చర్యతో దెబ్బకు దెబ్బ కొట్టాలని కసితో ఎదురుచూస్తుంది. ఈసారి కయ్యానికి కాలు దువ్వితే గనుక తెగబడిపోవడమేనని భావిస్తోంది.
ఆ దిశగా త్రివిద దళాలకు కేంద్ర స్పష్టమైన సంకేతాలు కూడా పంపేసింది. నేవీ, ఎయిర్ ఫోర్స్, ఆర్మీ సైనికులంతా యుద్ధానికి సిద్దంగా ఉన్నారు. ఇప్పటికే గాల్వానా వద్దకు పెద్ద ఎత్తున భారత ఆర్మీ చేరుకుంది. యుద్ధ సామాగ్రితో యుద్ధానికి సంసిద్దమై ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ ఈరోజు త్రివిద దళాల అధిపతులతో సమావేశమయ్యారు. నియంత్రణ రేఖ వెంబడి దళాల మోహరింపుతో పాటు, సరిహద్దులో ప్రస్తుతం నెలకొన్ని పరిస్థితులపై సమీక్షించినట్లు తెలుస్తోంది. ఇరు దేశాలు ఘర్షణ వాతావరణ తలెత్తకుండా ప్రవర్తించకూడదని, ఒకవేళ చైనా గనుక అలాంటి వాతావరణ కల్పిస్తే వెనక్కి తగ్గకుండా తెగబడి పోవాల్సిందిగా ఆదేశాలిచ్చినట్లు సమాచారం.
యుద్ధానికి సంబంధించి సైనికులకు, అధికారులకు పూర్తి స్వేచ్ఛనిస్తున్నట్లు రాజ్ నాథ్ అధికారులతో తెలిపారుట. ఈ విషయంలో త్రివిద దళాలకు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. రక్షణ మంత్రి మాస్కో పర్యటనకు బయలుదేరే ఒక్క రోజు ముందు కీలక నిర్ణయం తీసుకోవడం విశేషం. సైన్యమే సొంత నిర్ణయాలు తీసుకునేలా ఇప్పటికే ప్రధాని మోదీ స్పష్టమైన సంకేతాలు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక చైనా కాలు దువ్వితే గనుక యుద్ధం తప్పదని తేలిపోయింది.