Crime News: ఈ రోజుల్లో పుట్టిన పిల్లల దగ్గర నుండి ముసలివారి వరకు ఆడవారికి రక్షణ లేకుండా పోతోంది. పసిపిల్లలు మహిళలు వృద్ధులు ఇలా ఒంటరిగా కనిపిస్తే చాలు కొందరు పురుషులు మృగంలా మారి వారి మీద అ దాడులకు పాల్పడుతున్నారు. మరికొందరైతే వావి వరసలు మరచి తల్లి బిడ్డ అక్క చెల్లి అని కూడా చూడకుండా అత్యాచారాలు చేస్తున్నారు. ఇటువంటి దారుణాలకు అడ్డుకట్ట వేయడానికి ప్రభుత్వాలు కఠినమైన చట్టాలు శిక్షలు అమలు చేసినప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకుండా పోతోంది. ఇటీవల భువనగిరి జిల్లా చౌటుప్పల్ మున్సిపల్ కేంద్రం లో దారుణ సంఘటన చోటు చేసుకుంది. అద్దె ఇంట్లో రాత్రి వేళలో ఇంట్లో ఒంటరిగా ఉన్న గర్భిణీ మహిళ మీద అత్యాచారయత్నం చేశాడు ఆ ఇంటి యజమాని.
పోలీసులు తెలిపిన వివరాల మేరకు….. చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని కాటమయ్య కాలనీలో నివాసముండే దంపతులు చౌటుప్పల్ మున్సిపాలిటీ పరిధిలోని దివిస్ పరిశ్రమలో ఉద్యోగం చేస్తున్నారు. మంగళవారం రోజు భర్తకు నైట్ డ్యూటీ ఉండటంతో గర్భవతి అయిన సదరు వ్యక్తి భార్య మంగళవారం రాత్రి ఇంట్లో ఒంటరిగా ఉండవలసి వచ్చింది. సదరు వ్యక్తి డ్యూటీకి వెళ్ళడం గమనించిన ఇంటి ఓనర్ వెంకటరెడ్డి ఎలాగైనా తన కామ వాంఛ తీర్చుకోవాలని ఈ తరుణంలో కత్తి తీసుకొని ఇంటి దగ్గరకు వెళ్లి ఆమెను కత్తితో బెదిరించి ఇంటి లోపలికి వెళ్లి, డోర్ గడియపెట్టి తన లైంగిక వాంఛ తీర్చాలి అని బెదిరించాడు.
వెంకటరెడ్డి చర్యలను తీవ్రంగా ప్రతిఘటించిన బాధితురాలు గట్టిగా కేకలు వేస్తూ ఇంటి నుండి బయటకు తప్పించుకొని బయటికి వచ్చింది. ఇది గమనించిన వెంకట రెడ్డి భార్య వెంటనే వెంకటరెడ్డిని ఇంటిలోపలికి లాక్కొని వెళ్ళింది. గర్భిణీ మహిళ ఊపిరి పీల్చుకొని వెంటనే డ్యూటీ కి వెళ్ళిన తన భర్త కు ఫోన్ చేసి జరిగిన సంఘటనను వివరించింది. డ్యూటీలో ఉన్న భర్త ఇంటికి దగ్గరగా ఉన్న తన తమ్మునికి ఫోన్ చేసి ఘటన గురించి వివరించాడు. ఆయన తమ్ముడు వెంటనే 100 కి ఫోన్ చేసి పోలీసులకు సమాచారం అందించాడు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వెంకటరెడ్డినీ అదుపులోకి తీసుకోవడానికి వెళితే…. తన భర్త మద్యం మత్తులో అలా చేసి ఉంటాడని, క్షమించాలని వెంకట్ రెడ్డి భార్య పోలీసులను ప్రాధేయపడింది అని తెలిపారు.
అనంతరం బాధితురాలి భర్త మాట్లాడుతూ… తను డ్యూటీకి వెళ్లిన ఈ విషయాన్ని గమనించి ఇంటి ఓనర్ ఇలా చేయడం దారుణమైన ఘటన అని, అతని మీద కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు తెలిపారు. వెంటనే స్పందించిన పోలీసులకు ధన్యవాదాలు తెలిపారు. ఇటువంటి వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన పోలీసులను బాధితురాలి భర్త పోలీసులని కోరాడు. ఒకవేళ తాగిన మైకంలో వెంకట్ రెడ్డి తన భార్య ను హత్య చేసి ఉంటే ఆ నిందను తనపై మోపే వారని బాధితురాలి భర్త వాపోయారు. ఈ ఘటన గురించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సిఐ శ్రీనివాస్ తెలిపారు.