Ice Apple: తాటి ముంజలు వేసవి కాలంలో మాత్రమే విరివిగా లభిస్తాయి. వేసవి కాలంలో మాత్రమే ఈ తాటి ముంజలు ఎక్కడ చూసినా కనిపిస్తాయి. వీటిని ఐస్ ఆపిల్ అని కూడా అంటారు. అత్యంత తక్కువ ధరతో లభించే ఈ తాటి ముంజలు వేసవి తాపం నుండి మన శరీరానికి కాపాడటమే కాకుండా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా అన్ని వయసుల వారు ఈ పండ్లను హాయిగా తినవచ్చు. తాటి ముంజలలో పొటాషియం, కాల్షియం, జింక్, ఐరన్, విటమిన్ ఏ, సి , డి వంటివి పుష్కలంగా ఉంటాయి. ఇన్ని పోషకాలు కలిగిన తాటి ముంజలు తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం…
ముఖ్యంగా వేసవి కాలంలో తాటి ముంజలు తినడం వల్ల అందులో ఉన్న నీటి శాతం శరీరం డీహైడ్రేషన్ బారిన పడకుండా కాపాడుతుంది. తాటి ముంజలలో నీటి శాతం ఎక్కువగా ఉండటం వల్ల అధిక ఉష్ణోగ్రతల నుండి వడదెబ్బ తగలకుండా శరీరాన్ని రక్షిస్తుంది. తాటి ముంజలలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది. హైబీపీ సమస్యతో బాధపడే వారు వీటిని తినడం వల్ల బిపి అదుపులో ఉంచి గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా కాపాడుతాయి.
తాటి ముంజలు ప్రతిరోజూ తినడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ తొలగిపోయి మంచి కొలెస్ట్రాల్ వృద్ధి చెందుతుంది. వేసవికాలంలో తరచూ వచ్చే వాంతులు, వికారం, తల తిరగడం వంటి సమస్యలను తాటి ముంజలు తినడం వల్ల నియంత్రించవచ్చు.వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల జీర్ణక్రియ మెరుగు పడి మలబద్ధకం ఎసిడిటీ వంటి జీర్ణ సంబంధిత వ్యాధులు కూడా తగ్గుతాయి.
తాటి ముంజలు శరీర ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మ సౌందర్యానికి కూడా ఎంతో ఉపయోగపడతాయి. వేసవి కాలంలో అధిక ఉష్ణోగ్రతల వల్ల తరచు శరీరం నుండి చెమట వల్ల చెమట కాయలు ఇబ్బంది పెడతాయి. అలాంటి సమయంలో తాటి ముంజలు బాగా మెత్తని పేస్టులా చేసి ముఖం,మెడకి రాసుకొని 15 నిమిషాల తరువాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయటం వల్ల శరీరానికి కావలసిన తేమ అందించి చెమటకాయలను అరికడుతుంది.