Crime Videos: మైసూరు నగరం లో దారుణం.. ఏడు నెలల గర్భిణి అనుమానాస్పద మృతి..!

Crime News: ఈ మధ్యకాలంలో యువత ప్రేమ మాయలో పడి తల్లిదండ్రులను మోసం చేస్తున్నారు. ప్రేమ పేరుతో ఎంతో మంది యువతులు సర్వస్వం ధారపోసి మోసపోతున్నారు మరి కొంతమంది అమ్మాయిలు ప్రేమించిన వారి కోసం తల్లిదండ్రులను మోసం చేసి ఇంటి నుంచి పారిపోయి మరి రహస్యంగా వివాహాలు చేసుకుంటున్నారు. అలా పెళ్లిళ్లు చేసుకున్న వారిలో చాలామంది విడిపోతున్నారు.అలా కాకుండా మరికొంత మంది మాత్రం దారుణాలకు ఒడిగడుతున్నారు. తాజాగా కర్ణాటకలోని మైసూరు నగరంలో పెద్దలను ఎదిరించి ప్రేమ పెళ్లి చేసుకున్న యువతి అనుమానాస్పదంగా మృతి చెందింది.

వివరాల్లోకి వెళితే… కర్ణాటకలోని మైసూరు నగరం, విజయ నగర్ కు చెందిన అశ్విని అనే యువతి మదనపల్లికి చెందిన ప్రమోద్ నీ ప్రేమించి పెద్దలు అంగీకరించకపోవడంతో గుళ్లో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం అశ్విని ఏడు నెలల గర్భవతి.ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరు గత కొంతకాలంగా ఇద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో తరచు గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో అశ్విని తన పుట్టింటికి వచ్చేసింది. ఈ క్రమంలో భార్యను తీసుకెళ్లడానికి ప్రమోద్ కూడా ప్రతి ఇంటికి వెళ్లి భార్య తో మాట్లాడాడు.

మధ్యాహ్నం భోజనం తర్వాత దంపతులిద్దరూ బైక్ మీద షికారుకు వెళ్లారు. చీకటి పడిన కూడా కూతురు, అల్లుడు ఇంటికి రాకపోవడంతో అశ్విని తల్లిదండ్రులు కంగారుపడి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాలలో అశ్విని దంపతుల కోసం గాలించారు. కానీ సోమవారం ఉదయం బీలి కేరే నదిలో శవమై కనిపించింది.

అశ్విని, ప్రమోద్ మధ్య ఉన్న గొడవల కారణంగా ప్రమోద్ అశ్విని హత్య చేసి ఉంటాడని ఆమె తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రమోద్ మీద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు మొదలుపెట్టారు.అశ్విని మృతదేహాన్ని పోలీసులు పోస్టు మార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు.పోస్టుమార్టం తర్వాత అశ్విని మృతదేహాన్ని పోలీసులు ఆమె కుటుంబ సభ్యులకు అందజేశారు.