Upasana: మెగా కోడలు ఉపాసన పెద్ద బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలను సొంతం చేసుకున్నారు. ఇలా బిజినెస్ ఉమెన్ గా, అపోలో హాస్పిటల్ చైర్పర్సన్ గా అన్ని వ్యవహారాలను చూసుకుంటున్న ఈమె మంచి కోడలిగా కూడా గుర్తింపు సంపాదించుకున్నారు. ఇక ఉపాసన తన అత్తయ్య సురేఖతో కలిసి ఇటీవల కాలంలో అత్తమాస్ కిచెన్ ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇలా ఈ ఫుడ్ బిజినెస్ ద్వారా ఈమె కుకింగ్ రెసిపీస్ తో పాటు పికిల్స్ కూడా అందుబాటులోకి తీసుకోవచ్చారు.
ఇక ఈ వేసవి నుంచి ఉపాసన పికిల్స్ కూడా తమ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని తెలియజేశారు. ఇలా అత్తమాస్ కిచెన్లో తయారైనటువంటి ఈ పికిల్ ను ఇటీవల కాలంలో ఉపాసన స్టార్ సెలబ్రిటీ లందరికీ కూడా కానుకగా పంపిస్తున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ హీరోయిన్ నటి కియార అద్వానీకి కూడా అత్తమాస్ కిచెన్స్ నుంచి తయారుచేసిన పికిల్ పంపించినట్టు తెలుస్తుంది.
ఇక కియార అద్వానీ మరొక కొద్ది రోజులలో తల్లి కాబోతున్న విషయం తెలిసిందే. ఈమె నటుడు సిద్ధార్థ మల్హోత్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఇలా పెళ్లి తర్వాత వరుస సినిమాలకు కమిట్ అయిన ఈమె త్వరలోనే తల్లి కాబోతున్నట్లు తెలియజేశారు మరి కొద్ది రోజులలో పండంటి బిడ్డజన్మ నివ్వబోతున్న కియారా కోసం ఉపాసన పికిల్ పంపించారు. ఇక ఈ విషయాన్ని కియారా సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ తన సంతోషాన్ని వ్యక్తపరచడమే కాకుండా, తనకోసం స్పెషల్ గా ఈ పికిల్ పంపించినందుకు ఉపాసన రాంచరణ్ లకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేశారు. ఇక రామ్ చరణ్ కియార జంటగా వినయ విధేయ రామ, గేమ్ చేంజర్ సినిమాలలో నటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ రెండు సినిమాలు కూడా డిజాస్టర్ కావటం గమనార్హం.