ఇమ్రాన్ ఖాన్‌కు సుప్రీంకోర్టు గట్టి ఝలక్ ఇచ్చింది. అవిశ్వాస తీర్మానాన్ని డిప్యూటీ స్పీకర్ తిరస్కరించడాన్ని రాజ్యాంగ విరుద్ధంగా పేర్కొంది. ఇమ్రాన్ అవిశ్వాస తీర్మానం ఎదుర్కోవాల్సిందేనని వెల్లడించింది. ఇమ్రాన్‌ఖాన్‌పై ప్రతిపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై ఏప్రిల్ 9న ఓటింగ్ నిర్వహించాలని ఆదేశించింది. పాకిస్థాన్‌లో ఆర్థిక సంక్షోభానికి ఇమ్రాన్ ప్రభుత్వమే కారణమంటూ మార్చి 8న ప్రతిపక్ష పార్టీల ఎంపీలు అవిశ్వాస తీర్మానం నోటీసు ఇచ్చిన విషయం తెలిసిం